శ్రీకాకుళం జిల్లా: రణస్థలంలో బాలిక హత్య పేరిట చెలరేగిన పుకార్లు స్థానికంగా కలకలం రేపాయి. మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు వ్యక్తులు నాలుగేళ్ల బాలికను తీసుకొచ్చారని.. రణస్థలం శ్మశానం ఎక్కడ? అని అడిగారని, కొద్దిసేపటి తర్వాత శ్మశానవాటిక వద్దకు వెళ్లి అక్కడి చెరువులో బాలికను పడేసి పరారయ్యారని స్థానికులు చర్చించుకోవడం మొదలైంది. ఈ వార్త దావానంలో పాకడంతో మహిళలు, పెద్దలు భారీ సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు.
విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో జె.ఆర్.పురం సీఐ అవతారం, ఎస్సై చిరంజీవి ఆదేశాలతో కానిస్టేబుల్ పి.రమేష్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సుమారు నాలుగు గంటల పాటు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ద్విచక్ర వాహనాల నంబర్లపై ఆరా తీశారు. చివరకు సదరు ద్విచక్ర వాహనదారులు జె.ఆర్.పురంలో మంగళవారం ఓ వ్యక్తి చనిపోవడంతో పరామర్శ కోసం వచ్చారని గుర్తించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


