breaking news
Four-year-old girl
-
దేశం చెప్పినా పాపను ఇవ్వట్లేదు
అరిహా షా. నాలుగేళ్ల పాప. బెర్లిన్‌లో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉంది. ఈ పాపను భారత్‌కు అప్పజెప్పమని విదేశాంగ మంత్రి జైశంకర్ బుధవారం ఆ దేశపు విదేశాంగమంత్రిని కోరారు. గత సంవత్సరం ప్రధాని మోదీ స్వయంగా పాపను అప్పజెప్పమని ప్రతిపాదించారు. కాని జర్మనీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఆమె తల్లిదండ్రులు పాప కోసం చూస్తున్నారు. ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుపుతున్నారు. పిల్లల పెంపకంలో భారతీయుల వైఖరి విదేశీయులకు అర్థం కావడం లేదు. అదే సమయంలోమన పెంపకం సున్నితంగా మారాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు తెలియచేస్తున్నాయి.ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో భాగంగా విదేశాలకు వెళుతున్న భారతీయులు అక్కడ పిల్లల పెంపకం విషయంలో ఉన్న చట్టాల పట్ల సరిగా అవగాహన లేకుండా కష్టాలు తెచ్చుకుంటూనే ఉన్నారు. గతంలో నార్వేలో పిల్లలకు దూరమైన దంపతుల ఘటన మనకు తెలిసిందే (దీనిపై మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే సినిమా కూడా వచ్చింది). ఇప్పుడు మరో దంపతులు తమ కుమార్తె కోసం అలమటిస్తున్నారు. వారి పేర్లు భర త్ షా, ధారా షా. గుజరాత్‌కు చెందిన వీరి కుమార్తె అరిహా షా ఇప్పుడు బెర్లిన్‌లో జర్మనీ అధికారుల సంరక్షణలో ఉంది.ఏం జరిగింది?సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భరత్ షా తన భార్యతో కలిసి 2018లో బెర్లిన్‌కి ఉద్యోగార్థం వెళ్లాడు. 2021లో వారికి కుమార్తె పుట్టింది. అరిహా షా పేరు పెట్టుకున్నారు. పాపకు ఏడు నెలల వయసున్నప్పుడు (ప్రమాదవశాత్తు అనీ, నాయనమ్మ పొరపాటు వల్ల అనీ చెప్తున్నారు) పాప జననాంగం దగ్గర గాయం అయ్యింది. వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగానే ప్రోటోకాల్‌లో భాగంగా అధికారులు వచ్చి పరిశీలించి అత్యాచారం జరిగిందేమోనన్న అనుమానంతో పాపను తీసుకెళ్లిపోయి స్థానిక ‘యూత్ వెల్ఫేర్ ఆఫీస్’ సంరక్షణలో ఉంచారు. 2021 సెప్టెంబర్ నెలలో పాపను తీసుకెళితే ఇప్పటి వరకూ తిరిగి అప్పగించలేదు. జర్మనీ చట్టాల ప్రకారం పిల్లల పెంపకంలో పిల్లలకు హాని జరిగినట్టు ఆధారాలు కనిపిస్తే వారు పిల్లలను తమ సంరక్షణలో తీసుకుంటారు. అందులో భాగంగానే అరిహా షాను స్వాధీన పరుచుకుని తల్లిదండ్రులను కేవలం రెండు మూడు వారాలకు ఒకసారి పాపను చూసే అనుమతిని ఇచ్చారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు పాపను తమకు ఇవ్వమని పోరాడుతున్నారు.ప్రభుత్వం పూనుకున్నా...అరిహా షా బెర్లిన్ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచి భారత్‌లో ‘సేవ్ అరిహా’ పేరుతో ఉద్యమం మొదలైంది. చాలామంది గుజరాత్ నుంచి పాప కోసం ప్రచారం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఈ విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చాక 2024లో ప్రధాని మోదీ జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో పాప విషయం ప్రస్తావించి పాపను తల్లిదండ్రులకు అప్పగించవలసిందిగా కోరారు. ఆయన సానుకూలంగా స్పందించినా పాప ఇండియా చేరలేదు. అయితే భారత ప్రభుత్వ ప్రమేయం తర్వాత అత్యాచార అభియోగాన్ని వెనక్కు తీసుకున్నారు. తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రి జొహాన్ వాడెఫుల్‌ను అరిహా షా అప్పగింత కోసం సంప్రదించారు. ‘పాపకు తన భాష, మత, సంస్కృతి, సమాజ పరిసరాలలో పెరిగే హక్కు ఉందని, కాబట్టి పాపను అప్పగించాలని’ కోరినట్టు ఆయన తెలిపారు. విదేశాంగ మంత్రి కూడా దీనిపై సానుకూలత వ్యక్తం చేశారు.పొంచి ఉన్న ప్రమాదం...అయితే పాపను సంరక్షణలో ఉంచుకున్న బెర్లిన్ యూత్ వెల్ఫెర్ ఆఫీస్ ఇవన్నీ ఖాతరు చేయడం లేదు. అది ‘సివిల్ కస్టడీ కేసు’ వేసి పాప తల్లిదండ్రులకు శాశ్వతంగా పాప మీద పెంపకపు హక్కును రద్దు చేయమని కోరింది. దీని ప్రకారం తీర్పు వస్తే ఇకపై పాపను అనాథగా నమోదు చేసి అనాథాశ్రమంలో పెంచుతారు. ఈ విషయమై పాప తల్లిదండ్రులు తీవ్ర అందోళనలో ఉన్నారు. వారి వీసా గడువు కూడా త్వరలో ముగియనుంది. ఇకపై వారు పాపను చూడటం కష్టం కూడా. విదేశాలలో ఉన్న భారతీయులు ఇక్కడిలా అక్కడ పిల్లలను పెంచకూడదని ఈ ఘటన గట్టిగా చెబుతోంది. మన దేశ విధానాలను చాలా దేశాల్లో తప్పుగా, నేరంగా పరిగణిస్తారు. అదే సమయంలో మన దేశంలో కూడా పిల్లల పెంపకంలో సున్నితమైన మార్పులు అవసరం. వారితో వ్యవహరించే పద్ధతి మారకపోతే చట్టాలు కఠినంగా వ్యవహరించకపోయినా పిల్లల ప్రవర్తనలో పెను దోషాలు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. -
రాజస్తాన్‌లో అమానుషం
జైపూర్: రాజస్తాన్‌లోని దౌసాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దళిత బాలికపై దారుణానికి తెగించిన సబ్ ఇన్స్పెక్టర్పై జనం దాడి చేసి, కొట్టారు. ఎన్నికల వేళ జరిగిన ఘటనపై అధికార కాంగ్రెస్‌పై బీజేపీ దుమ్మెత్తి పోసింది. లాల్సోత్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దారుణానికి పాల్పడిన సబ్ ఇన్స్పెకర్ భూపేంద్ర సింగ్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాయమాటలతో బాలికను తన గదికి తీసుకువచ్చి, దారుణానికి పాల్పడినట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా పీటీఐకి చెప్పారు. ఘటన విషయం తెలిసి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఎస్ఐ భూపేంద్ర సింగ్‌ను రోడ్డుపైకి లాగి బట్టలు చిరిగేలా రాళ్లు, కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలు అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్‌పై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టామని ఎస్పీ వందితా రాణా చెప్పారు. అతడిని అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు పంపామన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఇది కూడా కాంగ్రెస్ గ్యారంటీయే: బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాలికలను కాపాడాలి (బేటీ బచావో) అని నినదిస్తుండగా రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ సర్కారు మాత్రం రేపిస్టులను కాపాడాలి(రేపిస్టు బచావో) అని అంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ ఘటన రాజస్తాన్‌కు మాత్రమే కాదు, మొత్తం దేశానికే అవమానకరమని విమర్శించారు. పోలీసులు, ఇతర అధికారులు మహిళలు, బాలికలపై పాల్పడిన అఘాయిత్యాలకు సంబంధించిన అనేక ఘటనలను పూనావాలా ఉదహరించారు. ఎన్నికల వేళ కూడా రేపిస్టులు ఎంతో ధీమాతో ఉన్నట్లు దీనితో అర్థమవుతోందని ఆరోపించారు. తాజా ఘటన కూడా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీయేనని వ్యాఖ్యానించారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. దారుణాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఉమేశ్ మిశ్రాను ఆయన ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం చేతకానితనంతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత బాలిక కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
అమెరికా తుపాకీ సంస్కృతికి నాలుగేళ్ల చిన్నారి బలి
హూస్టన్: ఇంటికో తుపాకీ పథకం అమల్లో ఉందా అన్నట్లు కనిపించే అమెరికాలో గన్ కల్చర్.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను తోడేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర సమీపంలోని హ్యారిస్ కౌంటీలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. కౌంటీ పోలీసు అధికారి ఎడ్ గోంజాల్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ‘బామెల్ నార్త్ హూస్టన్ రోడ్‌లోని ఓ అపార్ట్మెంట్లోని ఇంట్లో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో నాలుగు, మూడేళ్ల అక్కాచెల్లెళ్లు ఇంటి పడకగదిలోకెళ్లి అక్కడే ఉన్న సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను చూశారు. పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్న చెల్లెలు వెంటనే అక్కకు గురిపెట్టి కాల్చింది. తుపాకీ శబ్దంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అక్కడికొచ్చి చూసేసరికి నాలుగేళ్ల అమ్మాయి రక్తమోడుతూ కనిపించింది. 911కు ఫోన్‌చేసి అత్యవసర సిబ్బంది వచ్చి వైద్యంచేసేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. లోడ్ చేసిన తుపాకులను జాగ్రత్త చేయాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా తుపాకీ యజమానుల నిర్లక్ష్యం ఇలా ఎందరో అమా యకుల ప్రాణాలను బలికోరుతోంది’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. -
నాలుగేళ్ళ బాలికపై దూసుకెళ్ళిన పోలీసు వాహనం
-
నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి
విజయనగరం ఫోర్ట్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న వేళ అభం, శుభం తెలియని బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టీవీ చూసేందుకు వెళ్లిన బాలికపై ఎవరూ లేని సమయంలో బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తనతల్లికి తెలియజేసినట్టు సమాచారం. అయితే ఏకారణం చేతనో బాలిక తల్లిదండ్రులు మంగళవారం వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాలిక ఆరోగ్య పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గంట్యాడ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం విజయనగరం ఘోషాస్పత్రికి మంగళవారం సాయంత్రం తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే నేచర్ కొలాబ్ ఆర్గనైజేషన్ చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు నరవ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించి బాలికకు, బాలుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ కోన బంగారుబాబు, కౌన్సిలర్ జి.కె.దుర్గ, గ్రామ అంగన్ వాడీ వర్కర్ పాల్గొన్నారు. ఘోషాస్పత్రికి తీసుకొచ్చిన చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు, బాలల సంరక్షణ అధికారి లక్ష్మి పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. -
కూతుర్ని చంపి....తానూ చనిపోయింది
-
నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
చిత్తూరు: అభం శుభం తెలయని పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెదరాంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లి దండ్రులు బతకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లడంతో అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన శీనయ్య(25) అనే యువకుడు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు విన్న కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యేసరికి అతను అక్కడి నుంచి జారుకున్నాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
భాండుప్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం
సాక్షి, ముంబై: భాండూప్‌లోని మౌంట్ మేరీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బుధవారం నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన అదే పాఠశాల కర్కుతోపాటు మరో ఇద్దరు అనుమానితులను స్థానిక భాండూప్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా తరగతి గదిలోని బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఇతర విలువైన ఫర్నిచర్ ను బయటకు తీసుకొచ్చి నిప్పంటించారు. బాధితురాలితోపాటు కామాంధుడి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కేసు విచారణలో ఉంది.