నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం | Rape attempt on four-year-old girl in chittor district | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Jun 2 2015 11:42 AM | Updated on Jul 28 2018 8:51 PM

అభం శుభం తెలయని పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు.

చిత్తూరు: అభం శుభం తెలయని పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెదరాంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లి దండ్రులు బతకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లడంతో అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన శీనయ్య(25) అనే యువకుడు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు విన్న కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యేసరికి అతను అక్కడి నుంచి జారుకున్నాడు.

చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement