చిన్నారులపై లైంగిక దోపిడీ.. అమెరికా నుంచి కోట్లలో చెల్లింపులు! | Philippines Faces Growing Online Child Exploitation Crisis, Investigation Reveals | Sakshi
Sakshi News home page

చిన్నారులపై లైంగిక దోపిడీ.. అమెరికా నుంచి కోట్లలో చెల్లింపులు!

Oct 12 2026 7:06 PM | Updated on Oct 12 2026 7:18 PM

Philippines Faces Growing Online Child Exploitation Crisis, Investigation Reveals

ఫిలిప్పీన్స్‌లో చిన్నారులపై ఆన్‌లైన్ లైంగిక దోపిడీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ దర్యాప్తు ప్రకారం.. దాదాపు 5 లక్షల మంది చిన్నారులను బలవంతంగా లైంగిక వేధింపులు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు, లైవ్‌స్ట్రీమింగ్‌ కంటెంట్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కంటెంట్‌ను వీక్షించేందుకు అత్యధికంగా అమెరికా నుంచి డబ్బులు చెల్లిస్తున్నట్లు ఈ దర్యాప్తులో వెల్లడైంది.

2020 నుంచి 2022 మధ్య చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ కోసం అమెరికా కొనుగోలుదారులు ఫిలిప్పీన్స్‌కు 70 లక్షల డాలర్లకు పైగా పంపినట్లు సదరు మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాదు 2015 నుంచి 2023 వరకు ఈ తరహా కంటెంట్‌ను కొనుగోలు చేసిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉన్నట్లు ఫిలిప్పీన్స్‌ యాంటీ మనీ లాండరింగ్‌ కౌన్సిల్‌ తెలిపింది.

చిన్నారుల తల్లులే నిందితులు
కుటుంబ సభ్యుల పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని బాలికలను ఈ అకృత్యాల్లోకి నెడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంలో గతేడాది చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించి అరెస్ట్‌ అయిన మొత్తం 50 మంది మహిళల్లో 32 మంది బాధిత చిన్నారుల తల్లులేనని సదరు సంస్థ పేర్కొంది.

అంతేకాదు బాధితుల్లో ఐదేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కొందరు మహిళలు మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా విదేశీ కస్టమర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి కోరికల మేరకు చిన్నారులపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది.

లైంగిక దోపిడీ కట్టడి చర్యలు సరిపోతున్నాయా?
చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు ఉన్నాయి. టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో అక్రమ విక్రయాలు కొనసాగుతున్నట్లు పరిశోధనలు గుర్తించాయి. ఈ నేరాలను అరికట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు, ఆన్‌లైన్‌ పర్యవేక్షణతో పాటు బాధిత చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: హౌతీ దెబ్బకు వణుకుతున్న సౌదీ?.. లక్షల కోట్లు బుగ్గిపాలేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement