జర్నలిస్ట్ రోసీపై ఢిల్లీ ఏసీపీ ఎదురుదాడి! | Delhi ACP Vivek Bhagat Counter FIR Against Journalist Rosy | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల ఆరోపణలు.. జర్నలిస్ట్ రోసీపై ఢిల్లీ ఏసీపీ ఎదురుదాడి!

Oct 14 2026 8:19 PM | Updated on Oct 14 2026 8:24 PM

Delhi ACP Vivek Bhagat Counter FIR Against Journalist Rosy

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వివేక్ భగత్ తాజాగా ఆ మహిళా జర్నలిస్ట్‌పై ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 3న ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా తనపై కులపరమైన దూషణలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

ఈ ఫిర్యాదుతో అక్టోబర్ 13న ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఆ మహిళా జర్నలిస్ట్‌, వార్తా పోర్టల్‌కు చెందిన గజేంద్ర సింగ్, మరో గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, తమను బెదిరించారని, కులపరమైన అవమానాలకు గురిచేశారని ఆరోపిస్తూ.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నిరసనలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తన కులాన్ని ప్రస్తావిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఏసీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఏసీపీ తనను అనుచితంగా తాకారంటూ మహిళా జర్నలిస్ట్‌ గతంలో ఆరోపణలు చేశారు.

మరోవైపు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసులు తమపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించిన ఎన్‌ఎస్‌యూఐ మహిళా కార్యకర్తలపైనా ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఇదీ చదవండి: చెవి కొరికి తిన్నావు.. బెయిల్ ఎలా ఇస్తాం?.. సుప్రీంకోర్టు ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement