ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం | Jeffrey Epstein Russia Link Trafficking Recruits, Oligarch Ties, Trips To Moscow | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం

Nov 22 2026 4:25 PM | Updated on Nov 22 2026 4:29 PM

Jeffrey Epstein Russia Link Trafficking Recruits, Oligarch Ties, Trips To Moscow

లైంగిక నేరాల్లో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు రష్యాతో ఉన్న సంబంధాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అక్కడి బడా వ్యాపారవేత్తలు, అధికారులతో ఉన్న సంబంధాలపై కీలక విషయాలు బయటకి వచ్చాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ రష్యా, ఇతర సోవియట్ దేశాల నుంచి 17 మంది మహిళలను తన సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. వీరిలో ముగ్గురు ఎప్‌స్టీన్‌పై లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించి న్యాయం కోరినట్లు తెలిపింది.

2008లో లైంగిక నేరానికి శిక్ష పడిన తర్వాత, తిరిగి సంపన్నులు, ఉన్నతాధికారుల వర్గాల్లో పలుకుబడి పెంచుకునేందుకు ఎప్‌స్టీన్‌ తన రష్యా బడా వ్యాపారవేత్తలు, అధికారులతో సంబంధాలను ఉపయోగించుకున్నట్లు నివేదిక పేర్కొంది. అతడికి రష్యాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వ్లాదిస్లావ్ డోరోనిన్, రష్యా మాజీ ఉప ఆర్థిక మంత్రి సెర్గీ బెల్యాకోవ్‌తో పరిచయాలు ఉన్నట్లు వెల్లడించింది.

ఎప్‌స్టీన్ 1998లో సరోవ్‌కు, 2002లో మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్లినట్లు విమాన ప్రయాణ రికార్డులు తెలిపాయి.

ఇక మరోవైపు ఎప్‌స్టీన్ జైలులో హత్యకు గురై ఉండవచ్చని ఫోరెన్సిక్ నిపుణుడు మైఖేల్ ఫ్రీమన్ అభిప్రాయపడ్డారు. అయితే అధికారికంగా అతడి మరణాన్ని ఆత్మహత్యగానే నిర్ధారించారు. 2019 ఆగస్టు 10న న్యూయార్క్ జైలులో ఎప్‌స్టీన్ మృతిచెందాడు.

ఇదీ చదవండి: ఎన్విడియా చిప్స్‌ను చైనాకు తరలించిన లీ మింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement