చైనాకు చెందిన లీ మింగ్ అనే వ్యక్తి, ఆలిస్ హువాంగ్, ఆమె భర్త కాంగ్ వీతో కలిసి ఎన్విడియా (Nvidia) ఏఐ చిప్స్‌ను చైనాకు తరలించే నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. సింగపూర్‌లో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న లీ మింగ్ పరిమితులున్న ఎన్విడియా చిప్స్‌ను అక్రమంగా చైనాకు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
లీ మింగ్ తన స్థానిక సంస్థ పేరుతో ఎన్విడియా చిప్స్‌తో కూడిన సర్వర్లను కొనుగోలు చేసి, వాటిని తొలుత మలేషియాకు తరలించినట్లు సింగపూర్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి మరో ప్రాంతానికి పంపినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 2025 ఫిబ్రవరిలో లీ మింగ్‌పై ఫ్రాడ్ కేసు కూడా నమోదైంది.
ఆలిస్ హువాంగ్, ఆమె భర్త కాంగ్ వీతో కలిసి లీ మింగ్ ఆగ్నేయాసియా దేశాల్లో భాగస్వామ్య సంస్థలను ఏర్పాటు చేసినట్లు నివేదిక తెలిపింది. వీరు 2021లో చైనాలో క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సెంచరీ లాంగ్‌టెంగ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం మెగాస్పీడ్ సంస్థ ద్వారా ఎన్విడియా చిప్స్‌ను పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అలీబాబా తమ ప్రధాన కస్టమర్ అని మెగాస్పీడ్ ఎన్విడియాకు తెలిపినట్లు, దీంతో ఆ సంస్థకు చిప్స్ కొనుగోలులో ప్రాధాన్యత లభించినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే అందులోని కొన్ని సర్వర్లను అమెరికా ఎగుమతి నియంత్రణ నిబంధనలకు విరుద్ధంగా షాంఘైలోని సంస్థకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈ వ్యవహారంపై 2024లోనే అమెరికా తన దర్యాప్తు ప్రారంభించింది. 2025 జూన్‌లో ఎన్విడియా మెగాస్పీడ్‌ను తన అంతర్గత ‘నో-సెల్’ జాబితాలో చేర్చింది. ఈ విషయంపై సింగపూర్‌లోనూ విచారణ జరగగా, నేరాలకు తగిన ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. అయితే ఆలిస్ హువాంగ్‌కు హెచ్చరిక జారీ చేసి, ఆ దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించారు.
ఇక మరోవైపు కాంగ్ వీపై చైనాలో స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ ఆరోపణలతో విచారణ జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. మెగాస్పీడ్ మాత్రం చిప్స్ అక్రమ రవాణా ఆరోపణలను ఇప్పటికే ఖండించింది. ఆలిస్ హువాంగ్ 2025 ఆగస్టులోనే సంస్థను వీడినట్టు తెలిపింది.
అయితే ఇదిలా ఉండగా.. ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్‌కి ఉన్న సంబంధం కారణంగా జెన్సన్ తన పదవి నుంచి తప్పుకున్నట్లు కథనం పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై డిసెంబర్ 1న అమెరికా కాంగ్రెస్ కమిటీల ముందు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఒకే రాత్రి 868 సార్లు పార్కింగ్‌కు ట్రై చేసిన కారు


