దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి వినియోగదారులపై మరోసారి ధరల పెంపు భారాన్ని మోపింది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో ఎంపిక చేసిన కార్ల మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు 2026 నవంబర్ 22 అంటే నేటి నుంచే అమల్లోకి వచ్చింది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంపిక చేసిన మోడళ్లపై సగటు ధరల పెరుగుదల (వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్) సుమారు 0.31 శాతంగా ఉండనుంది. అయితే అన్ని మోడళ్ల ధరలూ ఒకే విధంగా పెరగవు. ఏయే మోడళ్లపై ఎంత పెంపు ఉంటుందనే వివరాలను కంపెనీ విడిగా పరిగణించాల్సి ఉంటుంది.
2026లో ఇప్పటికే పలుమార్లు పెంపు
ఈ ఏడాదిలో మారుతి సుజుకి ధరలను పెంచడం ఇది నాలుగోసారి. గతంలో జూన్‌లో కొన్ని మోడళ్లపై రూ.30,000 వరకు, ఆగస్టులో అరేనా, నెక్సా శ్రేణిలో రూ.30,000 వరకు ధరలను పెంచింది. సెప్టెంబర్‌లోనూ ఎంపిక చేసిన కార్లపై రూ.20,000 వరకు పెంపు చేపట్టింది. ఈ మూడు విడతల్లో కలిపి ధరల పెరుగుదల 1 శాతానికి పైగా నమోదైంది.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
తాజా ప్రకటనలో ఏయే మోడళ్ల ధరలు పెరిగాయి, ఒక్కో వేరియంట్‌పై ఎంత అదనపు భారం పడుతుందనే వివరాలను మారుతి సుజుకి వెల్లడించలేదు. 0.31 శాతం అనేది అమ్మకాల పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించిన సగటు కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునేవారు డీలర్ల వద్ద తాజా ధరలను తెలుసుకోవడం మంచిది.
మరోవైపు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు కంపెనీ లాభదాయకతపైనా ప్రభావం చూపుతున్నాయి. 2026 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో మారుతి సుజుకి కన్సాలిడేటెడ్ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 26.36 శాతం తగ్గి రూ.2,466.1 కోట్లకు పరిమితమైంది. అధిక ఇన్‌పుట్ ఖర్చులు దీనికి ఒక కారణంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఖర్చుల భారాన్ని కొంతమేర వినియోగదారులకు బదిలీ చేసే దిశగా కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: బజాజ్ కొత్త పల్సర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే?


