ఆరమ్ ఎడిషన్‌తో.. విక్టోరిస్ మరింత కొత్తగా! | Maruti Suzuki Victoris Aurum Edition Launched | Sakshi
Sakshi News home page

ఆరమ్ ఎడిషన్‌తో.. విక్టోరిస్ మరింత కొత్తగా!

Oct 25 2026 4:20 PM | Updated on Oct 25 2026 5:01 PM

Maruti Suzuki Victoris Aurum Edition Launched

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. విక్టోరిస్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆరమ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. భారతదేశంలో విక్టోరిస్ వేగంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించిందని కంపెనీ వెల్లడించింది.

ఆరమ్ ఎడిషన్‌ అనేది కొత్త వేరియంట్ కాదు. ఇదొక యాక్సెసరీ కిట్ మాత్రమే. దీని ధర రూ.22,990. దీనిని స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌లకు మాత్రమే అందిస్తారు. బయటి వైపున, ముందు, పక్కల, వెనుక స్కిడ్ ప్లేట్ డిజైన్‌లతో పాటు వీల్ ఆర్చ్‌లలో కూడా కాపర్ కలర్ ఇన్సర్ట్‌లను చూడవచ్చు. ఫ్రంట్ గ్రిల్, ఫెండర్లు, బంపర్లు, బాడీ సైడ్ మోల్డింగ్‌లు మరియు డోర్ వైజర్‌లపై క్రోమ్ యాక్సెసరీలు ఉంటాయి. లోపల.. అనువైన 3D క్యాబిన్ మ్యాట్‌లు, 3D బూట్ మ్యాట్, బూట్ ఓపెనింగ్ కోసం సిల్ గార్డ్ వంటివి ఉన్నాయి.

స్ట్రాంగ్-హైబ్రిడ్ విక్టోరిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.43 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆరమ్ ఎడిషన్‌ కిట్ కోసం అదనంగా రూ.22,990 చెల్లించాలి. ఇది ఒక యాక్సెసరీ ప్యాకేజీ కాబట్టి, మెకానికల్‌గా కారులో ఎలాంటి మార్పు ఉండదు.

విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ 1.5-లీటర్, త్రీ సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఒక ఎలక్ట్రిక్ మోటార్, ఒక చిన్న బ్యాటరీ ప్యాక్‌తో మిళితం చేస్తుంది. పవర్ అనేది e-CVT ఆటోమేటిక్ ద్వారా ముందు చక్రాలకు డెలివరీ అవుతుంది. మైలేజ్ 28.65 కిమీ/లీ అని సమాచారం.

ఇదీ చదవండి: కొత్త హంగులతో.. బజాజ్ పల్సర్ లాంచ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement