కొత్త హంగులతో.. బజాజ్ పల్సర్ లాంచ్! | Bajaj Pulsar NS200 TFT Launched at Rs 1.60 Lakh | Sakshi
Sakshi News home page

కొత్త హంగులతో.. బజాజ్ పల్సర్ లాంచ్!

Oct 24 2026 12:32 PM | Updated on Oct 24 2026 12:43 PM

Bajaj Pulsar NS200 TFT Launched at Rs 1.60 Lakh

గత కొన్ని నెలలుగా బజాజ్ ఆటో తన మొత్తం పల్సర్ లైనప్‌ను అప్డేట్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు 2026 పల్సర్ ఎన్ఎస్200ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

సరికొత్త పల్సర్ ఎన్ఎస్200.. మునుపటిలాగే అదే 199.5 సీసీ ఫోర్ వాల్వ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. అయితే ఇది ఇప్పుడు 25 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌లో పెద్దగా మార్పులు లేవు, కానీ రైడర్లు ఇప్పుడు బజాజ్ స్పోర్ట్స్ షిఫ్టర్ నుంచి ప్రయోజనం పొందుతారు, ఇది ప్రాథమికంగా రెండు దిశలలో పనిచేసే క్విక్‌షిఫ్టర్.

టెక్నాలజీ పరంగా చూస్తే.. బజాజ్ అప్‌డేట్ చేసిన NS200లో 5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేను అమర్చింది. కాబట్టి మునుపటి మోడల్‌లో ఉన్న సెమీ-డిజిటల్ యూనిట్‌ను తొలగించింది. అప్‌డేట్ చేసిన క్లస్టర్‌తో పాటు, మరిన్ని ఫంక్షనాలిటీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. టైప్-సి USB పోర్ట్‌ అందుబాటులో ఉంటుంది. పానిక్ బ్రేక్ అలర్ట్ కూడా ఉంది, ఇది హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు హజార్డ్ లైట్లను ఫ్లాష్ చేస్తుంది.

అప్డేటెడ్ ఎన్ఎస్200 ఎబోనీ బ్లాక్, రేసింగ్ రెడ్, నార్డో గ్రే, పెర్ల్ మెటాలిక్ వైట్ అనే 3 కొత్త రంగులలో లభిస్తుంది. అయితే ఈ బైక్ డెలివరీలు ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: పాత డిజైన్.. కొత్త లుక్: ఈ బైక్ ధర ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement