ఉక్రెయిన్‌ దాడిలో కెర్చ్‌ వంతెన ధ్వంసం  | Ukraine drone attack kills two in Crimea as Kyiv targets bridge to Russia | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ దాడిలో కెర్చ్‌ వంతెన ధ్వంసం 

Nov 18 2026 6:12 AM | Updated on Nov 18 2026 6:12 AM

Ukraine drone attack kills two in Crimea as Kyiv targets bridge to Russia

రష్యాను తిరుగులేని విధంగా దెబ్బతీశామని జెలెన్‌స్కీ ప్రకటన

మాస్కో: ఆక్రమిత క్రిమియా దీవిని కలుపుతూ రష్యా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కెర్చ్‌ వారధిపై ఉక్రెయిన్‌ దాడికి పాల్పడింది. మిస్సైళ్లు, డ్రోన్లతో జరిపిన దాడిలో వంతెన కొంతభాగం ధ్వంసమైంది. దీంతో, రష్యా ప్రధాన భూభాగం నుంచి క్రిమియాకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. డ్రోన్లు, మిస్సైళ్లతో కెర్చ్‌ వంతెనను ధ్వంసం చేసినట్లు మంగళవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. 

రక్షణ వ్యవస్థలు, రాడార్లు, ఎల్రక్టానిక్‌ వార్‌ఫేర్‌ పరికరాలు, ఇతర లక్ష్యాలన్నిటినీ నిరీ్వర్యం చేస్తూ సోమవారం రాత్రి తుది దాడి చేపట్టామన్నారు. గత కొన్ని వారాలుగా ఈ ఆపరేషన్‌ను ఏడు  దశల్లో అమలు చేశామన్నారు. దేశీయంగా అభివృద్ధి పరిచిన లాంగ్‌ రేంజ్‌ డ్రోన్లతో వంతెనలోని రోడ్డు సెక్షన్‌ను, నెప్ట్యూన్‌ మిస్సైళ్లు, ఇతర డ్రోన్లతో రైల్‌ సెక్షన్‌ను ఢీకొట్టామని, అనంతరం ఫ్లెమింగో గైడెడ్‌ మిస్సైళ్లతో ఆపరేషన్‌ను ముగించామన్నారు. చివరగా రష్యాను ఊహించని రీతిలో తిరుగులేని విధంగా దెబ్బ కొట్టామన్నారు. ఈ దాడిలో వంతెనలోని రోడ్డు భాగం కొంతమేర పూర్తిగా ధ్వంసం కావడంతో రోడ్డు లింకు తెగిపోయింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement