‘సహకారం’తోనే భవిష్యత్తు  | Seafarers safety at East Asia, amid maritime threats Says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

‘సహకారం’తోనే భవిష్యత్తు 

Nov 18 2026 5:55 AM | Updated on Nov 18 2026 5:55 AM

Seafarers safety at East Asia, amid maritime threats Says PM Narendra Modi

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం ఆసియాన్‌ భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలి  

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం 

ఇండియా–ఆసియాన్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ  

తెరపైకి తొమ్మిది కీలక ప్రతిపాదనలు  

అనుసంధానం పెంపు, నావికుల భద్రత కోసం దీర్ఘకాలిక సముద్ర ప్రణాళిక 

కూటమిలోని సభ్య దేశాల పర్యాటకులకు ఉచితంగా ఈ–వీసాలు  

మనీలా: స్వేచ్ఛాయుతమైన, సమ్మిళితమైన, నియమాలపై ఆధారపడిన ఇండో–పసిఫిక్‌ ప్రాంతాన్ని భారత్‌ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీని భవిష్యత్తు ‘పోటీపై కాకుండా, సహకారంపై’ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇండో–పసిఫిక్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

మంగళవారం ఫిలిప్పీన్స్‌లో ఇండియా, ద అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌(ఆసియాన్‌) 23వ శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తొమ్మిది కీలక ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. 

అనుసంధానం పెంచడం, నావికుల భద్రత కోసం దీర్ఘకాలిక సముద్ర ప్రణాళిక, కూటమిలోని సభ్య దేశాల పర్యాటకులకు ఉచితంగా ఈ–వీసాలు, గనుల తవ్వకం, కీలక ఖనిజాలపై సహకారం, ఉమ్మడి సైబర్‌ ఫోరెన్సిక్స్‌ శిక్షణా కార్యక్రమం, పౌర అణుశక్తి రంగంలో సాంకేతిక మారి్పడుల కోసం ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. 

ఆసియాన్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్‌ ఇస్తున్న ప్రాముఖ్యతను మోదీ వివరించారు. ఈ ప్రాంతంలో, వెలుపల కూడా శాంతి, స్థిరత్వం కోసం భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రపంచ అనిశి్చతుల నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ఒక కొత్త కోణాన్ని సంతరించుకుందని వ్యాఖ్యానించారు. భారతదేశపు ‘యాక్ట్‌ ఈస్ట్‌’విధానం ఆసియాన్‌ దేశాలతో సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు.  

సామర్థ్యం, ఉమ్మడి సంకల్పం ఉన్నాయి  
గత కొన్నేళ్లుగా ప్రపంచం వరుసగా సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. నేడు ప్రపంచానికి శాంతి, స్థిరత్వం, ఊహించదగిన పరిస్థితులు అవసరమని అన్నారు. ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశం ఇతివృత్తం ‘మన భవిష్యత్తును కలిసి నిర్మించుకుందాం’అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉందని వెల్లడించారు. భారత్, ఆసియాన్‌ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతును కలిగి ఉన్నాయని, అందుకే పోటీతో కాకుండా సహకారంతో మన భవిష్యత్తు రూపుదిద్దుకోవాలని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనుకున్నది సాధించే సామర్థ్యం, ఉమ్మడి సంకల్పం మనకు ఉన్నాయని చెప్పారు.  

మన ప్రాంత భవిష్యత్తుకు నూతన దిశానిర్దేశం  
భారతదేశ వృద్ధి, ఆసియాన్‌ దేశాల శ్రేయస్సు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నట్లు తాము గట్టిగా విశ్వసిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ‘’ఆసియాన్‌ కమ్యూనిటీ విజన్‌–2045’, ‘వికసిత్‌ భారత్‌–2047’అనేవి మన ఉమ్మడి ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి తోడ్పడుతాయని ధీమా వ్యక్తంచేశారు. గత 12 ఏళ్లలో భారత్, ఆసియాన్‌లు తమ భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పడు మనం మన ప్రాంత భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు. దీనికి కొత్త దిశానిర్దేశం చేయాలని చెప్పారు. 

250 క్విక్‌ ఇంపాక్ట్‌ ప్రాజెక్టులు  
ఆసియాన్‌తో తమ భాగస్వామ్యం ఇప్పుడు ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి మాత్రమే కాకుండా.. డిజిటల్‌ టెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం వంటి రంగాలకు విస్తరించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు 100కు పైగా కార్యక్రమాలను చేపట్టామని, సుమారు 250 క్విక్‌ ఇంపాక్ట్‌ ప్రాజెక్టులు (తక్షణ ప్రభావం చూపే ప్రాజెక్టులు) ప్రారంభించామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం 10,000కు పైగా స్కాలర్‌íÙప్‌లను అందించామని చెప్పారు. 

భారత్, తొమ్మిది ఆసియాన్‌ దేశాల మధ్య నేడు నడుస్తున్న ప్రత్యక్ష విమాన సరీ్వసులు, పెరుగుతున్న పర్యాటక రంగం మన సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని స్పష్టంచేశారు. భారత్‌–ఆసియాన్‌ సంబంధాలకు 2027 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నిలుస్తుందని అన్నారు. ఇరుపక్షాలు తమ సంబంధాలకు 35 ఏళ్లు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటాయని తెలియజేశారు. ప్రజల మధ్య సంబంధాలను, యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, యువజన సదస్సు, యువ పార్లమెంటేరియన్ల మారి్పడి కార్యక్రమాలు, స్టార్టప్‌ హ్యాకథాన్‌లతో కూడిన ఇండియా–ఆసియాన్‌ యూత్‌ కనెక్ట్‌ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు.  

కీలక రంగాల్లో మరింత సహకారం  
‘ఆసియాన్‌’లో ఇండోనేసియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా, తిమోర్‌–లెస్టీలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా, చైనా, జపాన్, ఆ్రస్టేలియాతో సహా మరికొన్ని దేశాలు సంభాషణ భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్‌కు ప్రస్తుతం íఫిలిప్పీన్స్‌ సారథ్యం వహిస్తోంది. గత కొన్నేళ్లుగా భారత్, ఆసియాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 

1992లో ఆసియాన్‌–భారత్‌ సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ బంధం 1995 డిసెంబరులో పూర్తి స్థాయి భాగస్వామ్యంగా, 2002లో శిఖరాగ్ర స్థాయి భాగస్వామ్యంగా పరిణామం చెందింది. 2012లో ఈ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయి. మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఉపగ్రహ, వాతావరణ సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి సన్నద్ధతా విన్యాసాలు, మానవతా సహాయాన్ని వేగంగా అందించడం వంటి అంశాలతో సహా విపత్తు నిర్వహణపై సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తాజాగా ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement