breaking news
India-ASEAN ties
-
‘సహకారం’తోనే భవిష్యత్తు
మనీలా: స్వేచ్ఛాయుతమైన, సమ్మిళితమైన, నియమాలపై ఆధారపడిన ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీని భవిష్యత్తు ‘పోటీపై కాకుండా, సహకారంపై’ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇండో–పసిఫిక్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం ఫిలిప్పీన్స్‌లో ఇండియా, ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఆసియాన్) 23వ శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తొమ్మిది కీలక ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. అనుసంధానం పెంచడం, నావికుల భద్రత కోసం దీర్ఘకాలిక సముద్ర ప్రణాళిక, కూటమిలోని సభ్య దేశాల పర్యాటకులకు ఉచితంగా ఈ–వీసాలు, గనుల తవ్వకం, కీలక ఖనిజాలపై సహకారం, ఉమ్మడి సైబర్ ఫోరెన్సిక్స్ శిక్షణా కార్యక్రమం, పౌర అణుశక్తి రంగంలో సాంకేతిక మారి్పడుల కోసం ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. ఆసియాన్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ఇస్తున్న ప్రాముఖ్యతను మోదీ వివరించారు. ఈ ప్రాంతంలో, వెలుపల కూడా శాంతి, స్థిరత్వం కోసం భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రపంచ అనిశి్చతుల నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ఒక కొత్త కోణాన్ని సంతరించుకుందని వ్యాఖ్యానించారు. భారతదేశపు ‘యాక్ట్ ఈస్ట్’విధానం ఆసియాన్ దేశాలతో సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. సామర్థ్యం, ఉమ్మడి సంకల్పం ఉన్నాయి గత కొన్నేళ్లుగా ప్రపంచం వరుసగా సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. నేడు ప్రపంచానికి శాంతి, స్థిరత్వం, ఊహించదగిన పరిస్థితులు అవసరమని అన్నారు. ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశం ఇతివృత్తం ‘మన భవిష్యత్తును కలిసి నిర్మించుకుందాం’అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉందని వెల్లడించారు. భారత్, ఆసియాన్ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతును కలిగి ఉన్నాయని, అందుకే పోటీతో కాకుండా సహకారంతో మన భవిష్యత్తు రూపుదిద్దుకోవాలని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనుకున్నది సాధించే సామర్థ్యం, ఉమ్మడి సంకల్పం మనకు ఉన్నాయని చెప్పారు. మన ప్రాంత భవిష్యత్తుకు నూతన దిశానిర్దేశం భారతదేశ వృద్ధి, ఆసియాన్ దేశాల శ్రేయస్సు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నట్లు తాము గట్టిగా విశ్వసిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ‘’ఆసియాన్ కమ్యూనిటీ విజన్–2045’, ‘వికసిత్ భారత్–2047’అనేవి మన ఉమ్మడి ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి తోడ్పడుతాయని ధీమా వ్యక్తంచేశారు. గత 12 ఏళ్లలో భారత్, ఆసియాన్‌లు తమ భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పడు మనం మన ప్రాంత భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు. దీనికి కొత్త దిశానిర్దేశం చేయాలని చెప్పారు. 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఆసియాన్‌తో తమ భాగస్వామ్యం ఇప్పుడు ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి మాత్రమే కాకుండా.. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం వంటి రంగాలకు విస్తరించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు 100కు పైగా కార్యక్రమాలను చేపట్టామని, సుమారు 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు (తక్షణ ప్రభావం చూపే ప్రాజెక్టులు) ప్రారంభించామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం 10,000కు పైగా స్కాలర్íÙప్‌లను అందించామని చెప్పారు. భారత్, తొమ్మిది ఆసియాన్ దేశాల మధ్య నేడు నడుస్తున్న ప్రత్యక్ష విమాన సరీ్వసులు, పెరుగుతున్న పర్యాటక రంగం మన సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని స్పష్టంచేశారు. భారత్–ఆసియాన్ సంబంధాలకు 2027 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నిలుస్తుందని అన్నారు. ఇరుపక్షాలు తమ సంబంధాలకు 35 ఏళ్లు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటాయని తెలియజేశారు. ప్రజల మధ్య సంబంధాలను, యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, యువజన సదస్సు, యువ పార్లమెంటేరియన్ల మారి్పడి కార్యక్రమాలు, స్టార్టప్ హ్యాకథాన్లతో కూడిన ఇండియా–ఆసియాన్ యూత్ కనెక్ట్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు. కీలక రంగాల్లో మరింత సహకారం ‘ఆసియాన్’లో ఇండోనేసియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా, తిమోర్–లెస్టీలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా, చైనా, జపాన్, ఆ్రస్టేలియాతో సహా మరికొన్ని దేశాలు సంభాషణ భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్‌కు ప్రస్తుతం íఫిలిప్పీన్స్ సారథ్యం వహిస్తోంది. గత కొన్నేళ్లుగా భారత్, ఆసియాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 1992లో ఆసియాన్–భారత్ సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ బంధం 1995 డిసెంబరులో పూర్తి స్థాయి భాగస్వామ్యంగా, 2002లో శిఖరాగ్ర స్థాయి భాగస్వామ్యంగా పరిణామం చెందింది. 2012లో ఈ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయి. మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఉపగ్రహ, వాతావరణ సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి సన్నద్ధతా విన్యాసాలు, మానవతా సహాయాన్ని వేగంగా అందించడం వంటి అంశాలతో సహా విపత్తు నిర్వహణపై సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తాజాగా ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చాయి. -
భారత్-ఆసియాన్ స్నేహం చాలా ముఖ్యం: ప్రధాని మోదీ
వియంటైన్: 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం-ఆసియాన్ స్నేహం ముఖ్యమైనదని అన్నారు. వచ్చే 2025వ ఏడాది ఆసియాన్-భారత పర్యాటక సంవత్సరమని తెలిపారు. లావోస్ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం పాల్గొని మాట్లాడారు. ‘‘ 10 సంవత్సరాల క్రితం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించాం. గత దశాబ్దంలో ఇది భారతదేశం, ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలకు కొత్త శక్తిని, దిశను, వేగాన్ని ఇచ్చింది. పొరుగు దేశాలుగా, భాగస్వాములుగా.. మనం శాంతి, ప్రేమిగల దేశాలం. ఒకరి జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం.ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం.PM Narendra Modi participated in the 21st ASEAN-India Summit in Vientiane, Lao PDR, today. In the 10th year of the Act East Policy, PM announced a 10-point plan to strengthen connectivity and resilience based on the theme of ASEAN Chair 2024, including physical, digital,… pic.twitter.com/acDHohIo1h— ANI (@ANI) October 10, 20242019లో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాల ప్రస్తావిస్తూ.. గతేడాది ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం సముద్ర కార్యక్రమాలు ప్రారంభించాం. గత దశాబ్దంలో ఆసియాన్ దేశాలతో భారతదేశ వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి 130 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. 10 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నాం. నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్లు రెట్టింపు చేస్తాం. భారత్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆసియాన్ విద్యార్థులకు కొత్త గ్రాంట్లు ఇస్తాం’ అని అన్నారు.అంతకు ముందు లావోస్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి.. వియంటైన్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
ఆర్థిక బంధం మరింత బలపడాలి...
నేపిడా (మయన్మార్): భారత్-ఆసియాన్ దేశాలు గొప్ప భాగస్వాములుగా ఉండడానికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేపిడాలో జరిగిన 12వ భారత్-ఆసియాన్ సదస్సులో ఆయన బుధవారం హిందీలో ప్రసంగించారు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య రంగాలకు సంబంధించి భారత్‌లో కొత్త శకం ప్రారంభమైందని ఆసియాన్ దేశాధినేతలకు వివరించారు. ఆయా రంగాల అభివృద్ధిలో పరస్పర సహకారానికి భారత్‌తో భాగస్వాములుగా 10 దేశాల ఆగ్నేయాసియా దేశాల సంఘం- ఆసియాన్ ఉండవచ్చని పేర్కొన్నారు. ఆసియాన్ దేశాలతో భారత్ తన సంబంధాలను పటిష్ట పరచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘వాణిజ్యం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి మన మధ్య ప్రాచీనకాలం నుంచీ సంబంధాలు ఉన్నాయి’ అన్నారు. ఈ సంబంధాలు ఆధునిక సంబంధాలకు పటిష్ట పునాదులుగా నిలుస్తున్నాయని వివరించారు. భారత్ ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో ఆసియాన్‌కు ముఖ్య ప్రాధాన్యత ఉంటుందన్నారు. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా దీనిని మోదీ పేర్కొన్నారు. సముద్ర జలాలు, సరిహద్దులకు సంబంధించి అన్ని దేశాలు అంతర్జాతీయ నియమ, నిబంధలను పాటించాలని, ఈ బాధ్యత అన్ని దేశాలపై ఉంటుందని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని ఆగ్నేయాసియా దేశాలు-చైనా మధ్య ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో మోదీ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మలేషియా కంపెనీలకు ఆహ్వానం... భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని మలేషియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. భారత్‌లో వాణిజ్యానికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు ఆయన భారత్-ఆసియాన్ సదస్సులో భాగంగా మయన్మార్ ప్రధాని నజీబ్ రజాక్‌తో ఇంటర్నేషనల్ కన్వెక్షన్ సెంటర్లో సమావేశమయ్యారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాల పటిష్టతకు సంబంధించి తమతమ దేశాల్లో పర్యటించాలని పరస్పరం ఇరువురు ప్రధానులూ ఈ సందర్భంగా ఆహ్వానించుకున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ బాగుంది: థాయ్ థాయ్ ప్రధాని ప్రయూత్ ఛోన్-ఓ-ఛాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఈ ఆలోచన తమ దేశానికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. కాగా మోడీ తన పర్యటనలో భాగంగా మయన్మార్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ నాయకురాలు అంగ్ సాన్ సూకియాతో కూడా సమావేశమయ్యారు. ఆసియాన్ సదస్సు అనంతరం మోదీ 13న జరగనున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. తరువాత ఈ నెల 15-16 తేదీల్లో ఆస్ట్రేలియాలోని బ్రిస్సేన్‌లో నిర్వహించనున్న జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ మూడు సదస్సుల సందర్బంగా ఆయన దాదాపు 40 మందికి పైగా అంతర్జాతీయ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. కాగా జీ-20 సదస్సు సందర్భంగా ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికి సంబంధించి మోదీ అత్యద్భుతమైన సూచనలు, సలహాలు అందించగలరన్న విశ్వాసాన్ని ఆస్ట్రేలియా హై కమిషనర్ ప్యాట్రిక్ సుక్లింగ్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


