Jeffrey Epstein
-
ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్
ఇరాన్‌పై భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగింది. ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.తాజాగా విడుదలలైన ఈ పత్రాలు ప్రకారం ఎప్స్టీన్ ద్వారా ట్రంప్‌కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.రాజకీయ దుమారంఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే! -
నేను ఏ తప్పూ చేయలేదు: క్లింటన్
వాషింగ్టన్: సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్ కేసును దర్యాప్తు జరుపుతున్న కాంగ్రెస్ సభ్యుల బృందం ఎదుట మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ హాజరయ్యారు. తానెలాంటి తప్పూ చేయలేదని, ఎప్స్టీన్ వేధింపులకు సంబంధించి తనకు ఏమాత్రం తెలియదని చెప్పారు. న్యూయార్క్‌లోని చప్పాక్వాలో శుక్రంగా గోప్యంగా జరిగిన విచారణ సందర్భంగా రెండు దశాబ్దాల క్రితం అతడితో కొనసాగించిన సంబంధాలపై సభ్యులడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఎదుట మాజీ అధ్యక్షుడొకరు విచారణకు హాజరవడం ఇదే మొదటిసారి కానుంది. కాగా, బిల్ క్లింటన్‌పై ప్రత్యేకంగా ఎటువంటి అభియోగాలు లేనప్పటికీ ఇటీవల విడుదల చేసిన వీడియోల్లో ఆయన పలు సందర్భాల్లో కనిపించడం దుమారం రేపింది. గురువారం ఆయన భార్య హిల్లరీ క్లింటన్ సైతం కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి కూడా అయిన హిల్లరీని సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే, ఎప్స్టీన్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడున్నాడనే విషయం తనకు తెలియదని చెప్పారు. అతడితో సమావేశమైనట్లు కూడా తనకు గుర్తు లేదన్నారు. ఎప్స్టీన్ గురించి తామడిగిన ప్రశ్నల్లో చాలా మటుకు క్లింటన్ దంపతులు సమాధానమివ్వకుండా దాటేశారని కమిటీ చైర్ బాధ్యతల్లో ఉన్న జేమ్స్ కోమర్ చెప్పారు. ఉన్నత స్థానాల్లో కొనసాగే వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియ జెప్పడమే తమ ప్రయత్నం వెనుక ఉద్దేశమన్నారు. -
వాడు పెద్ద సైకో.. నన్ను వాడుకున్నాడు
-
మాజీ యువరాజు ఆండ్రూ విడుదల
లండన్: సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలతోపాటు అధికార దుర్వినియోగం, దు్రష్పవర్తన కేసులో అరెస్టయిన బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్–విండ్సర్ శుక్రవారం విడుదలయ్యారు. థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆయనను 11 గంటలపాటు ప్రశ్నించారు. విడుదలైన అనంతరం ఆండ్రూ నార్ఫోక్లోని వుడ్ఫామ్ హోమ్‌కు చేరుకున్నారు. మరోవైపు అండ్రూపై దర్యాప్తు కొనసాగుతోంది. విండ్సర్ రాజప్రాసాదంలో ఆయన గతంలో నివాసం ఉన్న రాయల్ లాడిŠజ్లో పోలీసులు శుక్రవారం సైతం సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ కీలక సమాచారాన్ని, కొన్ని ట్రేడ్ రిపోర్టులను ఎప్స్టీన్కు చేరవేసిన కేసులో ఆండ్రూను గురువారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 66వ పుట్టిన రోజునాడే అరెస్టయ్యారు. ఆండ్రూకు సంబంధించిన ఒక నివాసంలో సోదాలు పూర్తయ్యాయని, మరో నివాసంలో ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గత కొన్ని శతాబ్దాల్లో బ్రిటిష్ రాజకుటుంబంలో ఒక సభ్యుడు అరెస్టు కావడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరిసారిగా 1554లో అప్పటి రాణి ఎలిజబెత్–1(ఎలిజబెత్ ట్యూడర్) తోబుట్టువు అరెస్టయ్యారు. మరోవైపు అధికార దుర్వినియోగం కేసులో మాజీ యువరాజు ఆండ్రూపై ఆరోపణలు రుజువైతే కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్టు తర్వాత ఆండ్రూ ఇంకా స్పందించలేదు. -
జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలు
లైంగిక కుంభకోణం నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసులోబాధితురాలు రినా ఓహ్ (Rina Oh) ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటీష్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్ట్ తరువాత లైంగిక వేధింపుల పర్వంపై 40 ఏళ్ల రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్స్టీన్ లాంటిపవర్పుల్ వ్యక్తి సామాన్యులను, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఎలా లోబరుచుకుంటారో, ఎలాంటి వేధింపులకు గురిచేస్తారో వివరించింది.21 ఏళ్ల వయసులో ఉన్న తాను జెఫ్రీ ఎపిస్టీన్ వల్ల తాను అనుభవించిన నరకాన్ని ,ప్రస్తుత పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 1990ల చివరలో రీనా 21 ఏళ్ల ఆర్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడు, చిన్నతనంలోనే వేధింపులు గురికావడం, భయం, ఒంటరితనం మగ్గుతున్న తనకు ఎప్స్టీన్ ఒక ‘లైఫ్ లైన్’ లా కనిపించాడని, అయితే తన మౌనాన్ని అతను స్వార్థానికి వాడుకున్నాడని చెప్పింది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నపుడు తనకు ఎటువంటి షరతులు లేని స్కాలర్షిప్ ఇస్తానని నమ్మబలికి, ఫ్లోరిడాలోని ఎప్స్టీన్ ఎస్టేట్ లోపల, తనను బంధించారని, డబ్బు, రవాణా సౌకర్యం లేక తాను అక్కడ చిక్కుకు పోయానని వాపోయింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని తనను బెదిరించారని తెలిపింది.ఆమె అతన్ని కలవడానికి నిరాకరించినప్పుడు, "నువ్వు విధేయత చూపడం లేదు" అని చెప్పి ఆ ఆర్థిక సహాయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 21 వయస్సులోనే ముసలి దానిలా ఉన్నావని అవమానించాడని గుర్తు చేసుకుంది. తనకున్న రాజకీయ పలుకుబడితో (వాషింగ్టన్లో అందరూ తెలుసని చెప్పి) ఆమెను భయపెట్టాడు. తన తల్లిదండ్రుల వివరాలు కూడా అతనికి తెలుసని, మాట్లాడితే హాని చేస్తాడనే భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయానని చెప్పింది. ఎప్స్టీన్ డార్క్సీక్రెట్స్ అన్నీ తనకు చెప్పాడని, బాధితులను కేవలం శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా కృంగదీసేవాడని, దాని నుండి కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడొక ర్యాగింగ్ నార్సిసిస్ట్"గా అభివర్ణించింది.అంతేకాదు ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేరున్న ప్రతి ఒక్కరినీ,వారు ఎంతటి శక్తివంతమైన వారైనా (రాజకీయ నాయకులు లేదా ధనవంతులు), విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే అమెరికా ప్రభుత్వం ఈ కేసులో తీసుకుంటున్న చర్యలు సరిపోవని ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అన్నీ తెలుసు, ఆయన పేరు కూడా ఫైళ్లలో ఉంది, కాబట్టి ట్రంప్ కచ్చితంగా నిజాలు చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఆండ్రూ అరెస్టుపై స్పందనఎప్స్టీన్ కేసులో మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్ (Prince Andrew) అరెస్టు కావడంపై స్పందిస్తూ, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, ఇది ఒక ఉదాహరణగా నిలవాలని ఆమె పేర్కొంది. ఈ వ్యవహారంలోయూరప్ దేశాలు వేగంగా స్పందిస్తున్నాయని, కానీ అమెరికా ప్రభుత్వం జవాబుదారీతనం వహించకుండా తప్పించుకుంటోందని ఆమె విమర్శించారు.కాగా ఎప్స్టీన్ వేధింపుల నుండి బయటపడిన రినా ఓహ్ఆత్మగౌరవం కోసం పోరాడుతోంది. తనను తప్పుగా చిత్రీకరించిన వారిపై కోర్టులో కేసులు వేశారు. 2 మిలియన్లకు పైగా ఉన్న ఎప్స్టీన్ కేసు దర్యాప్తు ఫైళ్లను బహిరంగపరచాలని ఆమె కోరుతున్నారు.ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
ఎప్స్టీన్ ఫైల్స్ : మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్
దశాబ్దాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు (misconduct in public office) పాల్పడ్డారనే అనుమానంతో, బ్రిటన్ రాజుగ కింగ్ చార్లెస్-3 సోదరుడు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్ (Andrew Mountbatten)ను సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ మేరకు థేమ్స్ వ్యాలీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నార్ఫోక్కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ చట్టం ప్రకారం నిందితుడి పేరును వారు అధికారికంగా వెల్లడించలేదు.సమగ్రమైన పరిశీలన తర్వాతే ఆయనను అరెస్టు చేసినట్లు, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారని బీబీసీ నివేదించింది. 2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా తాము విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅంతకుముందు రోజు ఉదయం, సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్ వద్దకు గుర్తు తెలియని ఆరు పోలీసు కార్లు , సుమారు ఎనిమిది మంది సాదా దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు చేరుకోవడం కనిపించిందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు మాజీ యువరాజు ఈరోజు 66 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు
అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు దివంగత జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో తాజాగా విడుదలైన పత్రాలు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతున్నాయి. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన 'ఎప్స్టీన్ ఫైల్స్'లో వెల్లడవుతున్న అంశాలు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. భారతదేశంలోఆధ్యాత్మికతకు చిహ్నంగా భావించే మొక్కను నేరగాడు ఇంత దారుణమైన పనుల కోసం వాడిన వైనం దిగ్భ్రాంతి రేపింది.ఇటీవల విడుదలైన ఈమెయిల్స్ ప్రకారం ఎప్స్టీన్ ఫైల్స్‌లో "జోంబీ ఫ్లవర్" ప్రస్తావన బహిరంగ చర్చకు గురిచేసింది. ఎప్స్టీన్ తన నర్సరీలో ట్రంపెట్ ప్లాంట్స్ (Trumpet Plants) పెంచేవాడని తెలుస్తోంది. 2014 - 2015 నాటి ఇమెయిల్స్‌లో తన "నర్సరీలో ట్రంపెట్ ప్లాంట్లు" గురించి అడిగినట్టు, "స్కోపోలమైన్: మనిషి ఆలోచనా శక్తిని నశింపజేసే శక్తివంతమైన డ్రగ్" అనే శీర్షికతో ఉన్న సమాచారాన్ని ఎప్స్టీన్ ఫార్వార్డ్ చేశాడు. అసలేంటీ జోంబీ ఫ్లవర్వీటిని సాధారణంగా ఏంజెల్స్ ట్రంపెట్ లేదా డెవిల్స్ బ్రీత్ (Devil's Breath) అని పిలుస్తారు. ఇది అందమైన కానీ అత్యంత విషపూరితమైన మొక్క. వీటి పుష్పాలనే జోంబీ ఫ్లవర్ అని పిలుస్తారు. ఈ మొక్క బ్రుగ్మాన్సియా లేదా డాతురా జాతికి చెందినది. దీని ప్రభావంతో జ్ఞాపకశక్తి కోల్పోవడం, పూర్తిగా పట్టు కోల్పోవడం, మగత, కొన్నిసార్లు సంఘటనలను గుర్తుకు తెచ్చుకోలేరు కూడా.ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్‌డే రోజే హత్యస్కోపోలమైన్ ప్రభావంస్కోపోలమైన్ (Scopolamine)అనేదిఈ మొక్కల నుండి తీసే మందు. దీన్నే "డెవిల్స్ బ్రీత్" లేదా "జాంబీ డ్రగ్" అని పిలుస్తారు. ఇది తీసుకున్న మనిషిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దీని ప్రభావంలో ఉన్న వ్యక్తి ఎదుటివారు చెప్పినట్లు వింటాడు, వారు అడిగినవన్నీ ఇస్తారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. దీంతో ఈ డ్రగ్‌ను నేరపూరిత పనుల కోసం ఉపయోగించే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.విష స్వభావంఈ మొక్కలను సాధారణంగా బ్రగ్మాన్సియా (Brugmansia) మరియు దత్తూర (Datura) అని పిలుస్తారు. ఇవి పెద్ద తుత్తూరు (Trumpet) ఆకారంలో ఉండి, చూడటానికి అందంగా ఉంటాయి. కానీ వీటి ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ అత్యంత విషపూరితమైనవి. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన భ్రాంతులు (Hallucinations), కండరాల బలహీనత, రక్తపోటు పెరగడం, పక్షవాతం, మరణం కూడా సంభవించవచ్చు. కొలంబియాలో దీనిని 'బురుండంగా' అని పిలుస్తారు, అక్కడ నేరస్థులు బాధితులను లొంగదీసుకోవడానికి దీనిని ఎక్కువగా వాడుతుంటారు.శివుడికి ప్రీతి పాత్రం హిందూ తత్వశాస్త్రంలో దత్తూర (ఉమ్మెత్త) చాలా భిన్నమైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది శివుడికి పవిత్రమైనది. హిందూ పురాణాల ప్రకారం, ఉమ్మెత్త పువ్వులు, కాయలు పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. క్షీరసాగర మథనం సమయంలో పుట్టిన విషాన్ని (హాలాహలం) శివుడు మింగి లోకాన్ని రక్షించాడు. ఆ విష ప్రభావాన్ని తట్టుకోవడానికి ఉమ్మెత్త వంటి వనమూలికలను ఆయనకు సమర్పిస్తారని చెబుతారు. మనలోని విషపూరిత మైన ఆలోచనలను, అహంకారాన్ని దేవుడికి సమర్పించి నిర్మలమైన మనస్సును పొందాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం.ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్ -
ఎప్స్టీన్ను చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు
లైంగిక కుంభకోణంతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein). మైనర్ బాలికల అక్రమరవాణా, తన పలుకుబడి పెంచుకోడానికి ప్రముఖుల లైంగిక వాంఛలను తీర్చడానికి వారిని వాడుకున్నాడన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో 2005లో మైనర్ బాలికపై లైంగిక వెధింపుల కేసు నమోదు కావడంతో ఎప్స్టీన్ బాగోతం బహిర్గతమైంది. అయితే 2008లో దోషిగా తేలినా మామూలు శిక్షతో బయటకు రావడం వివాదాస్పదమైంది. ఆ తరువాత 2019లో మళ్లీ అరెస్ట్ అయిన కొద్ది రోజులకే న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీన్ని అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించినా, జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. బడా బాబుల పేర్లు బయటకు రాకూడదనే కారణంతోనే విచారణకుముందు ఎప్స్టీన్ను గుట్టుగా మట్టుబెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. తాజాగా జెఫ్రీ ఎప్స్టీన్ మరణంపై అతని కుటుంబం కోసం పోస్ట్‌మార్టం నివేదిక పరిశీంచిన ఫోరెన్సీక్ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింత ఆజ్యం పోశాయి.జెఫ్రీ ఎప్‌స్టన్ కన్నమూసి 7 ఏళ్లు గడుస్తున్నా అతని మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అతని ఆత్మహత్యగా నిర్ధారిస్తూ గతంలో వచ్చిన నివేదికలను ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ మరోసారి సవాలు చేశారు. ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జెఫ్రీది ఆత్మహత్య కాదు, గొంతు నులిమి చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.డాక్టర్ బాడెన్ కీలక సాక్ష్యాలు-వాదనలుఎప్స్టీన్ కుటుంబం తరపున పోస్ట్‌మార్టం ప్రక్రియను పరిశీలించిన డాక్టర్ బాడెన్, తన పరిశీలనలో కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. ఎప్స్టీన్ మెడలోని మూడు చోట్ల ఎముకలు విరిగి (ఒకటి హ్యోయిడ్ ఎముక, రెండు థైరాయిడ్ కార్టిలేజ్) ఉండటం ఇందులో ప్రధానమైన అంశంగా మారింది. బాడెన్ తన 50 ఏళ్ల కెరీర్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇలా మూడు ఎముకలు విరగడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గొంతు నులిమి హత్య చేసిననప్పుడు (Strangulation) మాత్రమే ఇది సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ బార్బరా సాంప్సన్ స్వయంగా పోస్ట్‌మార్టం సమయంలో లేకపోయినప్పటికీ, దీనిని ఆత్మహత్యగా ప్రకటించారని బాడెన్ ఆరోపించారు. ఎప్స్టీన్ ఉన్న మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో భద్రతా నిబంధనల లోపాన్ని ఎత్తి చూపారు. అలాగే జైలు రికార్డులు తారుమారు చేయబడ్డాయని అమెరికా న్యాయశాఖ (DOJ) నివేదిక కూడా ధృవీకరించింది.ఆ రాత్రి ఏం జరిగింది? – అనుమానాస్పద అంశాలుఎప్స్టీన్ మరణానికి ఒకరోజు ముందు, అతని సెల్మేట్ను వేరే చోటికి మార్చారు. ఆ రాత్రిఅతడిని గదిలో ఒంటరిగానే ఉంచారు. నిబంధనల ప్రకారం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఖైదీని పర్యవేక్షించాల్సి ఉండగా, రాత్రి 10:40 తర్వాత ఎటువంటి తనిఖీలు జరగలేదు. పైగా సిబ్బంది తనిఖీలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపుసీసీటీవీ ఫుటేజీలో రాత్రి 10:39 గంటల సమయంలో ఎప్స్టీన్ ఉన్న విభాగం వైపు ఎవరో వెళ్లినట్లు నారింజ రంగు నీడ (Orange Flash) కనిపించింది. అది నారింజ రంగు జైలు దుస్తులు ధరించిన మరో ఖైదీ అయి ఉండవచ్చని స్వతంత్ర విశ్లేషణలు చెబుతున్నాయి అంతేకాదు అతని సెల్లో అవసరానికి మించి దుప్పట్లు, బట్టలు ఉన్నాయి. వాటినే తాళ్లుగా మార్చినట్లు గుర్తించారు.అధికారిక నివేదికలు దీనిని ఆత్మహత్యగా చెబుతున్నప్పటికీ, జైలు సిబ్బంది నిర్లక్ష్యం, తప్పుడు రికార్డులు, మెడపై ఉన్న గాయాలతో పలు అనుమానాలకు తావిచ్చాయి. దీనికితోడు డాక్టర్ బాడెన్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల లక్షల పేజీలు, వేలాది ఫోటోలను విడుదల చేసిన తరువాత ఇది మరో కీలక పరిణామం.ఇదీ చదవండి: పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే! -
ఓటీటీ ట్రెండింగ్‌లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
గత కొన్నిరోజులుగా ఎప్స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈయన.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2005లో ఎప్స్టీన్ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా 'జెఫ్రీ ఎప్స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు.తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్‌గా ఎప్స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన) -
పుతిన్‌తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు..
న్యూఢిల్లీ: అమెరికా గూఢచారిగా ముద్రపడిన జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించి తాజాగా వెల్లడైన మరో విషయం చర్చనీయాంశంగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా పలువురు ఉన్నత స్థాయి రష్యా అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించినట్లు అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన తాజా పత్రాలు వెల్లడిస్తున్నాయి.సీఎన్ఎన్ కథనం ప్రకారం ఎప్స్టీన్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి రష్యా రాయబారి విటాలీ చుర్కిన్తో తరచూ సమావేశమయ్యేవారు. చుర్కిన్ కుమారుడు మాగ్జిమ్‌కు న్యూయార్క్‌లోని ఒక వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ఎప్స్టీన్ ప్రతిపాదించినట్లు ఈ పత్రాల్లో వెల్లడయ్యింది. 2017లో రాయబారి విటాలీ చుర్కిన్ ఆకస్మిక మరణం తర్వాత, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సంబంధాలు పెంచుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించారు. 2018 జూన్ 24న నోర్వే రాజకీయ నేత థోర్బ్జోర్న్ జగ్ల్యాండ్కు పంపిన ఈమెయిల్లో, ‘నాతో మాట్లాడటం ద్వారా పలు కీలక విషయాలు తెలుసుకోవచ్చని మీరు పుతిన్‌కు సూచించవచ్చు’ అని ఎప్స్టీన్ పేర్కొన్నారు.రష్యాలో పాశ్చాత్య దేశాల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలను వివరించే నెపంతో పుతిన్‌ను కలవాలని ఎప్స్టీన్ భావించారు. 2013లో మాజీ ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్కు రాసిన ఈమెయిల్లో నార్వే నేత ఒకరు జగ్ల్యాండ్ సోచిలో పుతిన్‌ను కలవబోతున్నారని, ఆ సమయంలో తన గురించి ప్రస్తావించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. తాను బిల్ గేట్స్ లాంటి ప్రముఖులకు సలహాదారునని, పుతిన్‌తో కనీసం రెండు మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు ఎప్స్టీన్ విన్నవించారు. అయితే సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్థిక సదస్సులో పుతిన్ కోరిన భేటీని తానే తిరస్కరించానని ఎప్స్టీన్ చెప్పుకున్నప్పటికీ, దానికి సరైన ఆధారాలు లేవు.ఎప్స్టీన్ వ్యవహారంపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ స్పందించారు. ఈ లైంగిక వేధింపుల కుంభకోణాన్ని రష్యా నిఘా సంస్థలే వ్యవస్థీకృతం చేసి ఉండవచ్చనే అనుమానంతో తమ దేశం దర్యాప్తు చేపడుతుందని ప్రకటించారు. ప్రపంచ దేశాల నేతలను బ్లాక్ మెయిల్ చేసేందుకు రష్యా వద్ద కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. ఎప్స్టీన్ రష్యా గూఢచారి అనే దానిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అటువంటి నిరాధారమైన విషయాలపై సమయం వృథా చేయవద్దని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘నో ఫోన్ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు! -
ఎప్స్టీన్ ఫైల్స్.. ఎట్టకేలకు స్పందించిన బిల్‌గేట్స్
అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వ్యవహారం ఎప్స్టీన్ ఫైల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎట్టకేలకు స్పందించారు. జెఫ్రీ ఎప్స్టీన్తో తాను టైం స్పెండ్ చేయడం పెద్ద తప్పైపోయిందని.. అందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నానని అన్నారాయన. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ఆస్ట్రేలియా 9న్యూస్ చానెల్ చీఫ్ పొలిటికల్ ఎడిటర్ చార్లెస్ క్రౌచర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంపై స్పందించారు. ‘‘2011లో తొలిసారి ఎప్స్టీన్ను కలిశా. అప్పటి నుంచి మూడు ఏళ్లపాటు కొన్ని విందు కార్యక్రమాల్లో మేం పాల్గొన్నాం అంతే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల నుంచి ‘గ్లోబల్ హెల్త్’ పేరిట విరాళాలు తెచ్చి పెడతానని అతను నాతో అన్నాడు. అది వృథా ప్రయత్నమని నేను అతనికి చెప్పాను. అతని దీవికి ఏనాడూ నేను వెళ్లింది లేదు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడిందీ లేదు. అతనితో గడిపిన ప్రతీ నిమిషం పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. అందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నా అని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల తాలుకా మెయిల్స్, మరికొన్ని ఫొటోలు వెలుగులోకి రావడాన్ని బిల్‌గేట్స్ తోసిపుచ్చారు. ఎప్స్టీన్ రాసిన డ్రాఫ్ట్ ఈ-మెయిల్స్‌లో ఉన్న ఆరోపణలు అసత్యమని, ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ తాను పంపలేదని తెలిపారు. మరోవైపు.. బిల్‌గేట్స్ వ్యక్తిగత ప్రతినిధి సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. గేట్స్ తనతో స్నేహం కొనసాగించలేదన్న కోపంతోనే ఎప్స్టీన్ అలా డ్రాప్ట్ మెయిల్స్‌ను సృష్టించి ఉంటాడని తెలిపారు. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్.. టీచర్, ప్రముఖ ఆర్థికవేత్త. అమెరికాలో పలు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆర్థిక సలహాదారుడిగా పని చేశాడు. అలా.. క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పరిచయం పెంచుకున్నాడు. అతనికి సంబంధించిన ప్రైవేట్ దీవుల్లో మైనర్లతో హైఫ్రొఫైల్ సెక్స్ రాకెట్ నిర్వహించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎప్స్టీన్, అతనికి సహకరించిన వ్యక్తిగత సిబ్బంది గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌ను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన అదే ఏడాది(2019)లో ఎప్స్టీన్ జైల్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు(ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి). ఈ కేసులో ఎప్స్టీన్ ప్రైవేట్ ఐల్యాండ్ నుంచి సేకరించిన పలు వివరాలు.. సెక్స్‌రాకెట్‌లో పలువురు ప్రముఖులు ఉండడంతో ఎప్స్టీన్ ఫైల్స్‌గా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో.. అమెరికా న్యాయ శాఖ (DOJ) తాజాగా రిలీజ్ చేసిన ఫైల్స్‌లో కొన్ని డ్రాఫ్ట్ ఈమెయిల్స్‌లో బిల్ గేట్స్ పేరు ప్రస్తావించబడింది. అందులో గేట్స్‌పై అనైతిక సంబంధాలు, రష్యన్ యువతుతో గడిపినందుకు సుఖ వ్యాధి (STD) సోకిందనే.. ఆరోపణలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అయితే.. ఈ వ్యవహారంపై బిల్ గేట్స్ మాజీ సతీమణి మిలిండా గేట్స్ సైతం స్పందించడంతో చర్చ తీవ్రతరమైంది. మెలిండా, బిల్‌గేట్స్‌లు 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎప్స్టీన్తో బిల్ గేట్స్ సంబంధాలు కూడా తమ వైవాహిక జీవితంలో విబేధాలకు ఒక కారణమనే రీతిలో ఆమె స్పందించారు. ఎప్స్టీన్ ఫైల్స్‌పై స్పందిస్తూ.. ఇవి నా వివాహ జీవితంలోని అత్యంత బాధాకరమైన కాలాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి అని అన్నారామె. అయితే.. సుఖ వ్యాధి అంశంపై స్పందిస్తూ.. ‘‘ఏ ప్రశ్నలు మిగిలి ఉన్నాయో, వాటికి సమాధానం చెప్పాల్సింది నా మాజీ భర్తే. నేను కాదు’’ అని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు.. 2022లో సీబీఎస్ మార్నింగ్స్ ఇంటర్వ్యూలో కూడా ఆమె.. బిల్ గేట్స్‌కు ఎప్స్టీన్తో ఉన్న పరిచయం తనకు అసౌకర్యం కలిగించిందని అన్నారు కూడా. -
30 లక్షల పేజీల పత్రాలు
న్యూయార్క్: అమెరికా కుబేరుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్పై దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది. 30 లక్షల పేజీల పత్రాలతోపాటు 2 వేల వీడియోలు, 1.80 లక్షల ఫొటోలు బయటపెట్టడం గమనార్హం. పలువురు యువతులు, బాలికలపై ఎప్స్టీన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు, ధనవంతులతో ఎప్స్టీన్ జరిపిన సంభాషణలపైనా దర్యాప్తు జరిగింది. దర్యాప్తు వివరాలు, పత్రాలను చట్ట ప్రకారమే బహిర్గతం చేసినట్లు న్యాయశాఖ వెల్లడించింది. వీటిని శుక్రవారం తమ వెబ్సైట్లో పొందుపర్చింది. ఇందులో ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్ (ప్రిన్స్ ఆండ్రూ), ఎలాన్ మస్క్ తదితర మిత్రులతోనూ ఎప్స్టీన్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈ–మెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఎప్‌స్టీన్‌తోపాటు ఆయన ప్రియురాలు మాక్స్వెల్ నిర్వాకాలపై దర్యాప్తు వివరాలు బయటపెట్టాలని ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ చట్టాన్ని తీసుకొచ్చింది. న్యాయ శాఖ గత నెలలో పరిమితంగా కొన్ని పత్రాలు విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాజాగా మొత్తం ఫైళ్లు బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎప్స్టీన్ బంధం చర్చనీయాంశంగా మారుతోంది. చాలామంది ప్రముఖులకు అమ్మాయిలను ఎరవేసి, తన పనులు పూర్తిచేసుకున్నట్లు ఎప్స్టీన్పై ఆరోపణలు వచ్చాయి. అయితే, అతడితో చాలా ఏళ్ల క్రితమే సంబంధాలు తెంచేసుకున్నానని ట్రంప్ ఇటీవల వివరణ ఇచ్చారు. జెఫ్రీ ఎప్స్టీన్ 1953 జనవరి 20న న్యూయార్క్‌లో జన్మించాడు. లైంగిక వేధింపులకు సంబంధించి ఆయనపై పలు అభియోగాలు నమోదయ్యాయి. 18 ఏళ్లలోపు బాలికలను వేధించినట్లు నిరూపణ జరిగింది. 2019 ఆగస్టు 10 న్యూయార్క్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మీరా నాయర్
న్యూయార్క్: జెఫ్రీ ఎప్స్టీన్పై అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన దర్యాప్తు పత్రాల్లో బాలీవుడ్ దర్శకురాలు, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు సైతం ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ప్రియురాలు మాక్స్వెల్ ఇచ్చిన విందుకు మీరా నాయర్ హాజరైనట్లు ఓ ఈమెయిల్ సందేశాన్ని ఈ పత్రాల్లో ప్రస్తావించారు. మాక్స్వెల్ ఇంట్లో జరిగిన ఓ సినిమా ప్రదర్శనకు, ఆ తర్వాత జరిగిన విందులో ఆమె పాల్గొన్నట్లు ఇందులో ఉంది. 2009 అక్టోబర్ 21న ఈ ఈమెయిల్‌ను అమెరికన్ ప్రచురణకర్త పెగ్గీ సీగెల్ మరొకరికి పంపించారు. బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్ కూడా హాజరైనట్లు మెయిల్లో పోస్టుచేశారు. ఈ సినిమా మహిళలకు బాగా నచ్చిందని పేర్కొన్నారు. అయితే, అది ఏ సినిమా అన్నది మెయిల్లో స్పష్టంగాలేదు. అందుబాటులో ఉన్న వివరాలను బట్టి చూస్తే అది ‘అమెలియా’అనే చిత్రం. మీరా నాయర్ దర్శకత్వం వహించారు. అమెరికా పైలట్ అమెలియా ఇయర్హర్ట్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిల్లరీ స్వాంక్, రిచర్డ్ గెరే నటించారు. విమానంలో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ప్రయత్నంలో అమెలియా 1937లో పసిఫిక్ సముద్రంపై ఉండగా అదృశ్యమయ్యారు. అయితే, ఎప్స్టీన్ పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంపై మీరా నాయర్ ఇంకా స్పందించలేదు. -
ఎప్స్టీన్ ఫైల్స్ : రష్యన్ ముద్దుగుమ్మలతో బిల్‌గేట్స్ ఆ జబ్బు , అంతేనా!
అమెరికానుపట్టికుదపిన లైంగిక నేరాల కోసేలో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్‌లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో టెస్లా అధినేత మస్క్‌పై తాజా ఆరోపణలతోపాటు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌పై సంచలన ఆరోపణలతో పాటు, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరును కూడా చేర్చడం గమనార్హం.బిల్ గైట్స్పై ఆరోపణలుబిల్ గేట్స్ రష్యన్ మహిళలతో శారీరంగా సంబంధాలను కలిగి ఉన్నాడని, దీంతో లైంగికంగా సంక్రమించే వ్యాధి(ఎస్టీడీ) బారిన పడ్డాడని పేర్కొంది. ఆ తర్వాత తన భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వడానికి యాంటీబయాటిక్స్ కోరాడని ఆరోపించింది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ఈమెయిల్స్ 2013, జూలై 18 నాటివి. ఎప్స్టీన్ డ్రాఫ్ట్ సందేశాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని గేట్స్ అప్పటి సలహాదారు బోరిస్ నికోలిక్ గొంతులో ఉన్నాయి. వాటిలో, గేట్స్ "రష్యన్ అమ్మాయిలతో" నిద్రపోతున్నాడని, లైంగిక సంక్రమణ వ్యాధి బారిన పడ్డాడని, దీంతో మెలిండా గేట్స్‌కు "రహస్యంగా" ఇవ్వగల యాంటీబయాటిక్స్ కోసం అడుగుతున్నాడని ఎప్స్టీన్ ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఈమెయిల్స్‌ను డిలీట్ చేయమని గేట్స్ కోరాడని ఎప్స్టీన్ కోరాడని కూడా ఈ మెయిల్స్ సారాంశం. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలంతీవ్రంగా ఖండించిన బిల్గేట్స్ఈ ఆరోపణలపై గేట్స్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా వాస్తవ దూరమైనవి, అసంబద్ధ మైనవి అని గేట్స్ ప్రతినిధి డైలీ మెయిల్‌తో అన్నారు. ఈ ఆరోపణలు ఎప్స్టీన్ ఫ్రస్ట్రేషన్‌కు నిరాశకు తార్కాణమని, అతని ఉచ్చులో చిక్కుకోవడానికి ,పరువు తీయడానికి ఎంత దూరం వెళ్లాడని ఆరోపించారు.జోహ్రాన్ మమ్దానీ తల్లి మరోవైపు ఈ ఆరోపణలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి చిత్రనిర్మాత మీరా నాయర్ కూడా చేర్చారు. 2009 అక్టోబర్ 21 న ప్రచారకర్త పెగ్గీ సీగల్ జెఫ్రీ ఎప్స్టీన్కు పంపిన ఇమెయిల్, దర్శకుడు మీరా నాయర్ తన సినిమా ఆఫ్టర్ పార్టీలో ఉన్నారని వెల్లడించింది. లైంగిక అక్రమ రవాణాదారు,దోషిగా తేలిన గిస్లైన్ మాక్స్వెల్ ఇంట్లో జరిగిన 2009 నాటి మూవీ "అమేలియా" ఆఫ్టర్ పార్టీకి హాజరైయ్యారని ఆరోపించింది.ఈ పార్టీకి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ , అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా హాజరయ్యారని పేర్కొంది. ఇదీ చదవండి: డాక్టర్ కల చెదిరి, యూట్యూబర్‌గా మారి..కట్ చేస్తే! -
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలం
సంచలనం ఎప్స్టీన్ ఫైల్స్‌లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మరోసారి మారు మోగుతోంది.దీనికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ కొత్త ఫైళ్లను వెలికి తీసింది. ఎలోన్ మస్క్ జెఫ్రీ ఎఎప్స్టీన్ మధ్య ఈమెయిల్ మార్పిడి జరిగినట్టు చెబుతోంది. 2012- 2013లో ఎప్స్టీన్ తన ప్రైవేట్ వర్జిన్ దీవులకు మస్క్‌ను ఆహ్వానించినట్లు ఈ మెయిళ్ల సారాంశం. దాదాపు 30 లక్షలకు పైగా కొత్త పేజీల ఎప్స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసింది. అయితే ఎప్స్టీన్ ద్వీపానికి తనను రమ్మని ఆహ్వానించి నప్పటికీ, తానెప్పుడూ వెళ్లలేదని గతంలోనే మస్క్ ఖండించాడు.తాజాగా విడుదలైన US న్యాయ శాఖ పత్రం, మస్క్ జెఫ్రీ మధ్య ఈమెయిల్స్ ద్వారా చాలా పెద్ద చర్చే జరిగినట్టు గుర్తించింది. ఎప్స్టీన్ ఐలాండ్‌కు మస్క్ణు ఆహ్వానించినట్టు, మస్క్ అక్కడి వెళ్లినట్టుగా వాదిస్తోంది. వీటిలో షెడ్యూల్ తేదీలు, లాజిస్టిక్స్, ఇతర ప్లాన్స్ ఉన్నాయిన వాదిస్తోంది. 2012 క్రిస్మస్ నాటి ఇమెయిల్‌లో, తన ద్వీపాన్ని సందర్శించమని మస్క్‌ను ఆహ్వానించాడు ఎప్స్టీన్. అయితే, మస్క్ వెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మరోసారి ఈ వార్తలు నెట్టింట చర్చకు దారి తీశాయి. అయితే ఎప్స్టీన్ ఆఫర్‌ను మస్క్ తిరస్కరించాడు. దీనికి ప్రతిస్పందనగా, ఎప్స్టీన్ మస్క్ సంకోచాన్ని అర్థం చేసుకున్నానని, గర్ల్‌ఫ్రెండ్‌తో స్వేచ్ఛగా ఉండవచ్చనే నిగూఢార్థంతో మరో సందేశాన్ని పంపాడు. కొన్ని వారాల తర్వాత, ప్రయాణ ఏర్పాట్ల కోసం మస్క్‌ను అడుగుతూ ఒక ప్రత్యేక ఇమెయిల్‌లో పంపాడు. “మీరు హెలికాప్టర్ ద్వీపానికి ఎంత మంది ఉంటారు?”మరుసటి రోజు ప్రతిస్పందనగా, మస్క్ ఇలా వ్రాశాడు, “బహుశా తాలూలా,తాను మాత్రమేనని, మీ ద్వీపంలో పగలు/రాత్రి హార్డెస్ట్ పార్టీ ఉంటుందా అని మస్క్ అడిగాడు. ఆ తరువాత 1-8వ తేదీ వరకు ఏ రోజునా, ఎపుడూ మీకోసం సిద్ధంగా ఉంటుందని మరో ఈయిల్ పంపాడు.కరేబియన్ పర్యటనలోమస్క్ ఇక్కడికి వెళ్లి ఉంటాడని భావించే2013 ఇమెయిల్ మార్పిడి కూడా ఫైల్లో ఉంది. “సెలవులలో BVI/సెయింట్ బార్ట్స్ ప్రాంతంలో ఉంటాను. సందర్శించడానికి మంచి సమయం ఉందా?” మస్క్ 2013, డిసెంబర్ 13 నాటి ఇమెయిల్‌లో రాశారు. ఇలా పలు దఫాలుగా మారి మధ్య ఈమెయిల్స్ ద్వారా సంభాషణ జరిగిందని చెబుతోంది. కానీ మస్క్ ఎపుడు అక్కడికి వెళ్లాడు అనేదానిపై రికార్డులు స్పష్టమైన ధృవీకరణ లేదు.ఎప్స్టీన్తో మస్క్ ఈమెయిళ్ళ వార్త వెలువడిన వెంటనే, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బిలియనీర్లు బ్రిటిష్ వర్జిన్ దీవులలో సెలవుల్లో ఉండటం సర్వసాధారణం. ఉన్నత స్థాయి ఆర్థికవేత్తను కలవమని అడగడం నేరం కాదు. మస్క్ గతంలోనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని, అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ఈ ఫైల్స్‌లో లక్షలాది ఈమెయిళ్ళు ఉన్నాయి, ఒకరి ఇన్‌బాక్స్‌లో పేరు ఉన్నంత మాత్రాన వారి నేరంలో భాగస్వాములైనట్లు కాదు. ఇది కేవలం మస్క్‌ను వేధించడానికి చేస్తున్న మరో ప్రయత్నం మాత్రమే అని ఒకరువ్యాఖ్యానించారు. అప్పట్లో ఎప్స్టీన్కు ఈమెయిల్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ సందర్భం ముఖ్యం. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు పూర్తి సంభాషణలను పరగణనలోకి తీసుకోవాలని మరొకరు రాశారు. తాను ఎప్స్టీన్తో సంభాషించలేదని మస్క్ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి ఎప్స్టీన్ నిర్వహించిన అనేక 'లంచ్‌లకు' వెళ్లాడు. తలులా రిలే ఒకసారి ఎప్స్టీన్ న్యూయార్క్ సిటీ పెంట్‌హౌస్‌ను సందర్శించాడు. ఈ విషయం తలులా ఎక్స్‌లో ఇప్పటికీ ఉన్న ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. కూడా అని మరొకరు అభిప్రాయ పడ్డారు. -
అబ్బే.. అది ట్రంప్ బ్యాచ్ పనేం కాదట!
అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగిన వేళ.. ఎప్స్టీన్ సె* కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్‌లో మాయమైన ట్రంప్ ఫొటో తిరిగి ప్రత్యక్షం అయ్యింది. ఫోటోను తొలగించడంలో ట్రంప్ బ్యాచ్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. అందులో నిజం లేదని, తాత్కాలికంగా రివ్యూ కోసమే వాటిని తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ తాజాగా ఒక స్పష్టత ఇచ్చింది.జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫొటోను, కీలక పత్రాలను డెమొక్రట్లతో కూడిన హౌజ్ఓవర్ కమిటీ సమక్షంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన వేల ఫొటోలు, కీలక సమాచారంతో కూడిన లక్షల ప్రతాలు ఉన్నాయి. అయితే.. అందులో నుంచి కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు కనిపించకుండా పోవడంతో డెమొక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ట్రంప్ తన భార్య మెలానియా.. ఎప్స్టీన్, అతని సహయకురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌తో దిగిన ఫొటో, అలాగే ట్రంప్ కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.ఈ చర్యను ట్రంప్‌ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమని డెమొక్రాట్లు ఆరోపించారు. మరోవైపు.. హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. ట్రంప్ ఫోటోను అమెరికా న్యాయ శాఖ మళ్లీ పునఃప్రచురించింది.అయితే.. ఆ ఫొటో తొలగింపు వెనుక ఎవరి ప్రమేయం లేదని న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసమే వాటిని తొలగించలేదు. ఆ ఫొటోల్లో ఎప్స్టీన్ బాధితులు ఎవరైనా ఉన్నారా? అని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు రివ్యూకు పంపారు. సమీక్ష అనంతరం అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎలాంటి మార్పులు లేకుండానే తిరిగి ప్రచురించాం. ఇది బాధితుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశమే అని ఎక్స్ ఖాతాలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక పోస్ట్ చేసింది.ప్రముఖ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందిన జెఫ్ ఎప్స్టీన్కు ట్రంప్, బిల్‌గేట్స్, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్.. పలువురు సినీ ప్రముఖలతోనూ మంచి సంబంధాలు ఉండేవి. అయితే.. అందులో కొందరి లైంగిక ఆనందం కోసం జెఫ్రీ ఎప్స్టీన్ అమ్మాయిలను సరఫరా చేసేవాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యాక.. సంచలనాలు వెలుగు చూడొచ్చని అంతా భావించారు. ఈ క్రమంలో.. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పటి నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.ట్రంప్ హయాంలో ఎప్స్టీన్ ఫైల్స్ విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అయితే అలా జరగకపోవడంతో ట్రంప్ తీరుపైనే డెమొక్రట్లు, ట్రంప్ వ్యతిరేకులు అనుమానాలు వ్యక్తం చేయసాగారు. అయితే ఎప్స్టీన్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అటు డెమొక్రట్లతో పాటు ఇటు రిపబ్లికన్ల నుంచి ఎదురైన ఒత్తిళ్ల నడుమ చివరకు ఫైల్స్ బయటకు వచ్చాయి. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన ఫోటోలు, ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్టులు, కాల్ లాగ్స్, కోర్టు పత్రాలు ఉన్నాయి. అయితే, బాధితులను ఎఫ్‌బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అభియోగాలపై అంతర్గత న్యాయశాఖ నివేదికలు లేవంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే.. లక్షల పేజీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. బాధితుల గోప్యతను కాపాడేందుకు సమీక్ష ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని.. ఇందులో 200 మందికి పైగా న్యాయవాదులు పాల్గొంటున్నారని న్యాయశాఖ అంటోంది. సమీక్ష ముగిశాక.. అందులో వివరాలను యధాతథంగానే ప్రచురిస్తామని స్పష్టత ఇస్తోంది. -
ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ డాటా గాయబ్
అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం కొనసాగుతోంది. డెడ్‌లైన్ గడువు దగ్గర పడుతుండడంతో కీచకుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ఫొటోలను, కీలక పత్రాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో.. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని ఫైల్స్ మాయం కావడం సంచలనంగా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధిం తాజాగా.. 24 గంటల్లోనే కనీసం 16 ఫైళ్లు అదృశ్యమయ్యాయి. అందులో ఒక ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్లతో పాటు ట్రంప్ భార్య మెలానియా, ఎప్స్టీన్ క్రైమ్ పార్ట్నర్ గిస్లేన్ మ్యాక్స్‌వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. మాయమైన ఫైల్స్‌లో ట్రంప్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉందనేది హౌజ్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమొక్రట్ల ప్రధాన ఆరోపణ. మరోవైపు.. ఆ ఫైల్స్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేదానిపై అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పొరపాటున జరిగిందా?.. ఏదైనా కారణంతో చేశారా? అనేదానిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే విడుదలైన ఆ డాక్యుమెంట్లలో.. బాధితులను దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్‌బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అంతర్గత మెమోలు వంటి కీలక పత్రాలు కనిపించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అయితే.. అలా జరగలేదు. ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే.. ఒకప్పుడు అతనితో స్నేహం ఉండేదని, అరెస్ట్ తర్వాత అతన్నొక మానవ మృగంగా భావించి దూరం పెట్టానని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఆ ఫైల్స్‌ను పారదర్శకంగా రిలీజ్ చేయించేందుకు తాను సిద్ధమని అంటూనే.. జాప్యం చేస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో.. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది.లేటెస్ట్ రిలీజ్లో.. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. ఇందులో.. ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. అలాగే.. ట్రంప్ సహా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐల్యాండ్‌లో సేదతీరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఐల్యాండ్స్‌లోని విలాసాలు.. అలాగే కొన్ని నగ్న ఫొటోలు కూడా అందులో ఉన్నాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్‌లో, పూల్‌లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫొటోల్లో.. ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. -
మళ్లీ ఎప్ స్టీన్ కలకలం
వాషింగ్టన్: అమెరికన్లు కొద్ది రోజులుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జెఫ్రీ సెక్స్ కుంభకోణం తాలూకు మరిన్ని ఫైల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ మహిళలను, ముఖ్యంగా బాలికలను సరఫరా చేసిన వైనం 20 ఏళ్ల కింద అమెరికాలో సంచలనం రేపడం తెలిసిందే. దాని తాలూకు ప్రకంపనాలు ఇప్పటికీ సద్దుమణగలేదు. అయితే తాజా ఫైల్స్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. విపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్‌లో, పూల్‌లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి. 20 ఏళ్ల కేసు: 2005 మార్చిలో ఒక బాలిక కుటుంబం ఫిర్యాదుతో ఎప్ స్టీన్ లీలలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామ్ బీచ్ కౌంటీలోని తన నివాసంలో పలువురు రాజకీయ తదితర ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ పలువురు బాలికను వాడుకున్నాడని వారు ఆరోపించారు. జనాగ్రహం నేపథ్యంలో అరెస్టైన అతడు 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎప్ స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు.ఆయుర్వేదం ప్రస్తావన!ఎప్ స్టీన్ ఫైల్స్‌లో ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. ’5 వేల ఏళ్ల పురాతనమైన భారత సహజ చికిత్సా ప్రక్రియను ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా చాలామంది అనుసరిస్తున్నారు’ అని వాటిలో పలుచోట్ల చెప్పుకొచ్చారు. అంతేగాక ’మసాజ్ చేసే కళ’ పేరిట పలు వ్యాసాలు కూడా వాటిలో ఉన్నాయి! -
ట్రంప్.. క్లింటన్.. బానన్.. బిల్‌గేట్స్.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో బాంబు!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైఫ్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రట్స్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ మరికొన్ని ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఇందులో.. డొనాల్డ్ ట్రంప్ కొంత మంది అమ్మాయిలతో(వాళ్ల మఖాల బ్లర్ చేసి ఉన్నాయి) కలిసి దిగిన ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. మరొక ఫొటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫొటోలో ఒక అమ్మాయితో(ముఖం కనిపించకుండా చేశారు) కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారాయన. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. వీటితో పాటు క్లింటన్ ఎప్స్టీన్తో దిగిన ఫొటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్‌లో బిల్‌గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు ఉన్నాయి.ట్రంప్.. ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. అయితే లైంగిక దాడి కేసులో ఎప్స్టీన్ అరెస్ట్(2004) తర్వాత ఆ బంధానికి ఎండ్‌కార్డ్ పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు. బానన్‌తో ఎప్స్టీన్ సెల్ఫీ.. పక్కన ఐల్యాండ్‌లోని ఓ గోడ మీద ఫొటోలో బిల్గేట్స్తాజాగా రిలీజ్ అయిన ఫొటోలు.. పలు ఈవెంట్లలో, పిచ్చాపాటి సంభాషణల్లో దిగిన ఫొటోలే ఉన్నాయి. అంతేగానీ.. అందులో ఉన్నవాళ్లంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగం అయినట్లు మాత్రం ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫొటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని అన్నారు. ‘‘నేను వాటిని చూడలేదు. కానీ అందరికీ ఈ వ్యక్తి(బానోన్ను ఉద్దేశిస్తూ..) తెలుసు. అతను పామ్ బీచ్‌లో ఎక్కడైనా కనిపించేవాడు. అతనితో వందలాది మంది ఫోటోలు ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’’ అంటూ బదులిచ్చారు. 🇺🇸⚡️Reporter: There were new Epstein photos released today showing..What was your reaction?Trump: I haven't seen them, but everybody knew this man (Bannon). He was all over Palm Beach. There are 100s and 100s of people that have photos with him. I know nothing about it. pic.twitter.com/KKWGtyr4Q2— Osint World (@OsiOsint1) December 12, 2025కామ పిశాచి.. ఎప్స్టీన్!అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ఏడాది జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని.. సన్నిహితంగా ఉన్న ప్రమఖలపైనా నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..ఎప్స్టీన్తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు కూడా).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో.. ఇది డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు.. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌజ్ ఓవర్‌సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎప్స్టీన్ ప్రైవేట్ ల్యాండ్స్‌కు సంబంధించి.. అందులో ఉన్న 150 ఫొటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్స్టీన్కు ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్తో ఎప్స్టీన్ చేసిన ఈ-మెయిల్లు, అలాగే ట్రంప్ మాజీ సలహాదారు బానన్‌కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి.అంతేకాదు ఐల్యాండ్‌లోని విలాసవంతమైన వసతుల ఫొటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మరోపక్క.. గిస్లేన్ మాక్స్వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి, కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
అదంతా పచ్చి అబద్ధం: ఎలాన్ మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్‌తో డొనాల్డ్ ట్రంప్‌ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్‌ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్‌లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్‌కు రావాలి అని ఉంది. దీంతో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్‌పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్స్టీన్కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్స్టీన్ ఐల్యాండ్‌కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్స్టీన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్‌గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.ఎవరీ ఎప్స్టీన్..అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ విగ్రహం తొలగింపుఎప్స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్‌హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


