ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మీరా నాయర్‌ | Why Film Maker Meera Nair Name Appears In US Justice Department Epstein Investigation Files, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మీరా నాయర్‌

Feb 1 2026 4:15 AM | Updated on Feb 1 2026 4:35 PM

Epstein files have revealed that filmmaker Mira Nair

న్యూయార్క్‌:  జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన దర్యాప్తు పత్రాల్లో బాలీవుడ్‌ దర్శకురాలు, న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ తల్లి మీరా నాయర్‌ పేరు సైతం ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎప్‌స్టీన్‌ ప్రియురాలు మాక్స్‌వెల్‌ ఇచ్చిన విందుకు మీరా నాయర్‌ హాజరైనట్లు ఓ ఈమెయిల్‌ సందేశాన్ని ఈ పత్రాల్లో ప్రస్తావించారు. మాక్స్‌వెల్‌ ఇంట్లో జరిగిన ఓ సినిమా ప్రదర్శనకు, ఆ తర్వాత జరిగిన విందులో ఆమె పాల్గొన్నట్లు ఇందులో ఉంది. 2009 అక్టోబర్‌ 21న ఈ ఈమెయిల్‌ను అమెరికన్‌ ప్రచురణకర్త పెగ్గీ సీగెల్‌ మరొకరికి పంపించారు. 

బిల్‌ క్లింటన్, జెఫ్‌ బెజోస్‌ కూడా హాజరైనట్లు మెయిల్‌లో పోస్టుచేశారు. ఈ సినిమా మహిళలకు బాగా నచ్చిందని పేర్కొన్నారు. అయితే, అది ఏ సినిమా అన్నది మెయిల్‌లో స్పష్టంగాలేదు. అందుబాటులో ఉన్న వివరాలను బట్టి చూస్తే అది ‘అమెలియా’అనే చిత్రం. మీరా నాయర్‌ దర్శకత్వం వహించారు. అమెరికా పైలట్‌ అమెలియా ఇయర్‌హర్ట్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిల్లరీ స్వాంక్, రిచర్డ్‌ గెరే నటించారు. విమానంలో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ప్రయత్నంలో అమెలియా 1937లో పసిఫిక్‌ సముద్రంపై ఉండగా అదృశ్యమయ్యారు. అయితే, ఎప్‌స్టీన్‌ పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంపై మీరా నాయర్‌ ఇంకా స్పందించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement