యువతిపై లైంగిక వేదింపులు.. డీఆర్‌డీఓ ఉద్యోగి మృతి | DRDO employee dies following rape of a woman | Sakshi
Sakshi News home page

యువతిపై లైంగిక వేదింపులు.. డీఆర్‌డీఓ ఉద్యోగి మృతి

Oct 22 2026 6:17 PM | Updated on Oct 22 2026 6:46 PM

DRDO employee dies following rape of a woman

సాక్షి, హైదరాబాద్‌: చిక్కడపల్లిలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉ‍న్న యువతిపై రామ్మోహన్‌ అనే డీఆర్‌డీఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. అత‌డిపై బాధిత యువ‌తి బంధువు దాడి చేయగా తలకు తీవ్ర గాయాలై, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. 

వివరాల్లోకి వెళితే.. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో రెండేళ్లుగా నివాసముంటున్న రామ్మోహన్ (55) డిఆర్‌డీఓలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా ఇంటి పక్కనే ఉన్న ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో నిన్న  (బుధవారం) రాత్రి కూడా రామ్మోహన్ యువతిని వేధించడంతో పక్కనే నివాసం ఉంటున్న తన బంధువైన అభిజిత్‌కు విష‌యం చెప్పింది. ఎందుకు వేధిస్తున్నావ‌ని రామ్మోహన్‌ను అభిజిత్ నిల‌దీశాడు. ఇరువురి మధ్య మాట మాట పెరిగి గొడవ జరగడంతో రామ్మోహన్‌ను అభిజిత్ తోసేసాడు.

తలకు గాయాలైన రామ్మోహన్‌ను చికిత్స నిమిత్తం కాచిగూడ లోని సీసీ షరాఫ్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ అత‌డు ఈరోజు చ‌నిపోయిన‌ట్టు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. రామ్మోహన్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: చెల్లెలి పెళ్లయి రెండు రోజులే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement