శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం పాలవలస గ్రామంలో డయేరియా విజృంభిస్తుంది. డయేరియాతో చిన్నారావు అనే వ్యక్తి మృత్యువాత పడగా, మరో ఆరుగురు వ్యక్తులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిఇలో ఇద్దరు, శ్రీకాకుళం ప్రైవేట్ ఆస్పత్రుల్లో మిగతా నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పారిశుథ్య లోపం కారణంగానే డయేరియా వ్యాపించిందని స్థానిక ప్రజలు అంటున్నారు.
గతంలో శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా జి. సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా వ్యాధి తీవ్రంగా వ్యాపించింది. సుమారు 40 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. దీనికి వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ప్రభావితమయ్యారు.
కలుషిత నీరు తాగడం వల్లే తరుచు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుందని జిల్లా వాసులు అంటున్నారు. సరైన తాగునీరు లేకపోవడం వల్ల ఈ వ్యాధి నియంత్రణలోకి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నివారణ చర్యలు
వైద్యశాఖ తరుచు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి.
ప్రజలకు శుభ్రమైన నీరు తాగడం, ఆహార పరిశుభ్రత పాటించడంపై అవగాహన కల్పించాలి.
-నీటి వనరుల శుద్ధి, సమగ్ర పరిశుభ్రత చర్యలు తీసుకోవడం జరగాలి


