తిరుపతి: తిరుపతి నగరంలోని హోటల్ రాజ్ పార్క్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డిఎక్స్‌తో పేల్చేస్తాం అని వచ్చిన మెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలను భద్రతగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అజిత ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. హోటల్ సిబ్బంది, అక్కడి అతిథులు భయాందోళనకు గురయ్యారు.


