సాక్షి, తాడేపల్లి: ఏపీలో పోర్టుల అభివృద్ధి విషయమై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి మన రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిదని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, తద్వారా మన రాష్ట్రాన్ని మార్చే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది అని అన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ ట్యాగ్ (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు.
Our long coastline is not just a geographical boundary!
It is an economic growth engine that will transform our State through Port-Led Development.#YSRCPPortsRevolution https://t.co/qu0mdXfSq1— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025


