కౌలుకోలేని దెబ్బ | - | Sakshi
Sakshi News home page

కౌలుకోలేని దెబ్బ

Dec 1 2025 9:38 AM | Updated on Dec 1 2025 9:38 AM

కౌలుక

కౌలుకోలేని దెబ్బ

సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 కష్టాల కడలిలో కౌలు రైతు ‘శ్రీకాళహస్తి’ పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదు ధాన్యం రైతుల ధైన్యం కౌలు రైతుల అవస్థలు వర్ణనాతీతం

న్యూస్‌రీల్‌

రైతుల ఆవేదన పట్టదా..?

పశ్చిమ డెల్టాకు నీటి నిలుపుదల

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

సాగర్‌ నీటిమట్టం వివరాలు

గుంటూరు
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
కష్టాల కడలిలో కౌలు రైతు

చీరాలకు చెందిన వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై బాపట్లలో కేసు నమోదు

చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు, టీడీపీ నాయకురాలు కొమ్మనబోయిన రజని, మరికొందరిపై బాపట్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీ సాయికాలనీకి చెందిన బి.కల్యాణి శుక్రవారం రాత్రి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాలు.. సాయికాలనీకి చెందిన కల్యాణి.. బచ్చు నాగరాజును రెండో వివాహం చేసుకుంది. అతడు 2021లో మరణించడంతో ఆమెకు మొదటి భార్య రవీంద్రకుమారితో ఆస్తి సంబంధిత వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదంపై కళ్యాణి చీరాల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. కేసు విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా ఆమెకు కొమ్మనబోయిన రజనితో పరిచ యం ఏర్పడింది. ఆమె న్యాయవాది ఊసా తులసీరావును పరిచయం చేసింది. అతను వివాదాస్ప ద ఆస్తులను కొనుగోలు చేస్తానని చెప్పి తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఫిర్యాది కల్యాణిని బాపట్లలో ఇల్లు అద్దెకు తీసుకోవాలని చెప్పి రైలుపేటలో ఇల్లు అద్దెకు ఇప్పించారు. ఈ క్రమంలో ఆమైపె పలుమార్లు లైంగికదాడి చేయడంతో పాటు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. అంతేకాకుండా రజనితో కలిసి అసభ్యకరమైన వీడియోలతో బెదిరించి వేధించాడు. వీడియోలు, ఫొటోలు ఇవ్వాలంటే ఆస్తులు తమవారి పేరున రాయాలని బెదిరించి రాయించుకున్నారు. ఆస్తులు రాయించుకున్నా కూడా వీడియోలు బయటపెడతామని బెదిరించడంతో భయాందోళనకు గురైన ఆమె బాపట్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఊసా తులసీరావు, కొమ్మనబోయిన రజనిలతో సహా పదిమందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి సభ్యురాలిగా రజనిపై కేసు నమోదు కావడంతో టీడీపీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ఆమెను ఎలాగైనా కాపాడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

తెనాలి: సాగువిస్తీర్ణంలో 85 శాతం కౌలురైతులే సాగుచేస్తున్నా వారికి ఎలాంటి ప్రభుత్వ ఆసరా దక్కటం లేదు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ఎన్నికల్లో హామీనిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇందుకోసం సబ్‌ కమిటీని నియమించింది. అందులో తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇంతకాలమై నా కమిటీ తన నివేదికను క్యాబినెట్‌కు సమర్పించలేదని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. ఫలితంగా కౌలు రైతులు కష్టాల సాగుచేస్తూ కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు.

2025–26 ఖరీఫ్‌ సీజనుకు పశ్చిమడెల్టాలో మాగాణి భూముల్లో వరిసాగు చేసిన రైతులకు సీజనులో ప్రకృతి వైపరీత్యాలతో ఎడాపెడా దెబ్బలు తగిలాయి. చివరకు పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుఫాన్‌ విరుచుకుపడింది. పంట నేలవాలిందని రైతులు హాహాకారాలు చేసినా.. అబ్బే! గుంటూరు జిల్లాలో 5 శాతంకు మించి నష్టం లేదంటూ ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకొంది. కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, నష్టం అంచనా కూడా వేయలేదు. తీరా పంట పక్వానికొచ్చాక నూర్పిడులు జరుగుతుంటే, ఎకరాకు 5–10 బస్తాలకు పైగా దిగుబడి తగ్గిన చేదు వాస్తవం బహిర్గతమైంది. చేసేదేముంది... ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిచి, ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించినా ఆచరణలో అధికార యంత్రాంగం సమన్వయలోపం వెల్లడైంది. అధికారుల హడావుడి చేసి జీపీఎస్‌ లేకున్నా ఫర్వాలేదు, సొంత వాహనాల్లోనూ తీసుకెళ్లొచ్చు...అంటూ అనుమతులిచ్చారు. కొనుగోలు చేసేటప్పుడు 17 శాతం లోపుగా ఉన్న తేమ, రైస్‌మిల్లుకు వెళ్లేసరికి 21 శాతం చూపుతుండటం, బస్తాకు 4–5 కిలోలను తరుగుగా తీయాల్సిందేనని చెప్పటంతో అన్నదాత హతాశుడవుతున్న దుష్టాంతాలున్నాయి.

ధాన్యం అమ్మకాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఇలాగుంటే, కౌలురైతుల అవస్థలు వర్ణనాతీతం. కౌలురైతు గుర్తింపు కార్డులు లేనందున ఈ–క్రాప్‌ నమోదుకు అవకాశం లేదని తెలిసిందే. ఎరువులు, విత్తనాల సంగతటుంచి వీరికి బ్యాంకు రుణాలు కూడా లేవు. పంటకు పెట్టుబడి అంతా అప్పులు తెచ్చి పెట్టారు. తీరా పంటచేతికొచ్చాక దిగుబడి తగ్గింది. ఇప్పుడా పంటకు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు కొనే ఆస్కారం కూడా లేదు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని బయట వ్యాపారుల కోసం ఎదురుచూస్తున్నారు. పచ్చిమీద నూర్పిడి చేశారనే సాకుతో వ్యాపారులు బస్తాకు రూ.1200, రూ.1300 మించి ఇచ్చేది లేదంటున్నారు. అసలు రెండురోజులుగా బయట వ్యాపారులు పొలాలకేసి వచ్చింది లేదని రైతులు చెప్పారు. ఇక రైతులకే దక్కని టార్ఫాలిన్లు కౌలురైతులకు ఎలా వస్తాయి. దీనితో వాటిని కూడా కౌలురైతులు కొనాల్సివస్తోంది.

7

మోంథా తుఫాన్‌తో ఇప్పటికే

పీకల్లోతు నష్టాల్లో..

అందని కౌలురైతు కార్డులు

నమోదుకాని ఈ–క్రాప్‌

ధాన్యానికి దక్కని ‘మద్దతు’

ధర తగ్గిస్తున్న వ్యాపారులు

దిత్వా తుఫాన్‌ హెచ్చరికలతో

గుండెల్లో గుబులు

టార్ఫాలిన్లకు సైతం దిక్కులేని దుస్థితి

ప్రస్తుతం దిత్వా తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రోడ్లు, మెరక ప్రదేశాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకోవటానికి కనీసం టార్పాలిన్లను కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోవటాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దావులూరులో కొనుగోలు కేంద్రం ప్రారంభించినపుడు మంత్రి నాదెండ్ల మనోహర్‌ టార్పాలిన్లను ఉచితంగా తీసుకెళ్లొచ్చని చెప్పినట్టు రైతులు గుర్తుచేస్తున్నారు. ఆచరణలో ఒక్కో రైతుసేవా కేంద్రానికి 15–20కు మించి ఇవ్వలేమని అధికారులు అంటున్నారని రైతులు చెబుతున్నారు. అదికూడా ధాన్యం కొనుగోలు ఒప్పందం చేసిన రైతులకేనని, అవసరం తీరాక ఇతర రైతులకోసం ఇవ్వాల్సి వుంటుందని కూడా చెప్పారు.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల చేశారు. సముద్రంలోనికి 3,625 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.

విజయపురిసౌత్‌: నాగార్జుసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.60 అడుగులకు చేరింది. ఇది 284.7452 టీఎంసీలకు సమానం.

కౌలుకోలేని దెబ్బ 1
1/6

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 2
2/6

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 3
3/6

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 4
4/6

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 5
5/6

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 6
6/6

కౌలుకోలేని దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement