నిద్రపోతున్న నిఘానేత్రం | - | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్న నిఘానేత్రం

Dec 1 2025 9:28 AM | Updated on Dec 1 2025 9:28 AM

నిద్రపోతున్న నిఘానేత్రం

నిద్రపోతున్న నిఘానేత్రం

నిద్రపోతున్న నిఘానేత్రం తాడేపల్లి రూరల్‌: రాజధాని ముఖద్వారమైన మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ముఖ్య కూడళ్లలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. పాత కెమెరాలకు మరమ్మతులు చేయించపోవడంతో అవి పూర్తిగా పాడయ్యాయి. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో అసలు ఏర్పాటే చేయలేదు. పలు ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కొంతమంది నాయకులు భారీ మొత్తంలో అధికారులకు నగదును అందజేశారు. మంత్రి నారా లోకేష్‌ నియోజకవర్గం కావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు భారీగా విరాళాలు వచ్చినట్లు సమాచారం. నెలలు గడుస్తున్నా కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూ మంత్రంగా గంజాయి, మద్యం బాబుల కదలికలను గమనించేందుకు మాత్రమే స్థానిక నాయకుల ద్వారా ఏర్పాటు చేసిన కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గం కాజా టోల్‌గేట్‌ నుంచి కనకదుర్గ వారధి, ఇటువైపు ప్రకాశం బ్యారేజ్‌ వరకు పాత, కొత్తజాతీయ రహదారుల్లో పోలీసులకు సంబంధించిన సీసీ కెమెరాలు ఒక్కమంగళగిరి పట్టణంలో మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో పనిచేయడం లేదు. పాత జాతీయ రహదారి వెంబడి ఎక్కడైనా వ్యాపారస్తులు, ఇళ్లలో నివసించే వారి సీసీ కెమెరాలు పరిశీలించి తూతూ మంత్రంగా నేరాలను పరిష్కరిస్తున్నారు. ● 16వనెంబర్‌ జాతీయ రహదారిపై కాజా టోల్‌ గేటు వద్ద నుంచి కనకదుర్గ వారధి వరకు ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటుచేయలేదు. హైవే సీసీ కెమెరాలు ఉన్నా.. ట్రాఫిక్‌ జామ్‌ అయినప్పుడు మాత్రమే పనిచేసేవిధంగా ఆ సంస్థ ఏర్పాటు చేసుకుంది. దీంతో ఎటువంటి నేరాలు జరిగినా పోలీసులు దానిని ఛేదించడంలో చాలా ఆలస్యం అవుతోంది. ● తాడేపల్లి బైపాస్‌రోడ్‌లో సర్వీస్‌రోడ్‌లో పాత కక్షల నేపధ్యంలో ఒక రౌడీషీటర్‌పై మరో రౌడీషీటర్‌, ఇంకో పిక్‌ పాకెటర్‌ దాడికి పాల్పడ్డారు. ఆ కేసులో అయితే నిందితులను అరెస్ట్‌ చేశారు తప్ప ఏ రౌడీషీటర్‌ది తప్పు అనేది తేల్చలేకపోయారు. ఇప్పటికై నా పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో నగదు వసూలు చేస్తున్న దోపిడీని అరికట్టాలని పలువురు కోరుకుంటున్నారు.

నిందితులకు వరం

గత నెల 13వతేదీ మంగళగిరి పట్టణ పరిధిలోని కొత్త బస్టాండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఒక మహిళ ఆటో ఎక్కగా ఆ ఆటోలో ఉన్న వారు మహిళను దారి మళ్లించి ఎయిమ్స్‌ హాస్పిటల్‌ ప్రాంతం నుంచి వడ్డేశ్వరం మీదుగా జాతీయ రహదారి నుంచి వెళ్లిపోయారు. ఆ మహిళ ఆచూకీ కోసం మంగళగిరి పోలీసులు సీసీ కెమెరాల్లో ఎక్కడైనా రికార్డు అయి ఉంటుందని పరిశీలించగా ఎక్కడా రికార్డు కాలేదు. చివరకు కృష్ణాజిల్లాలో రామలింగేశ్వర నగర్‌ నుంచి కృష్ణలంక మీదుగా ఇబ్రహీంపట్నం వరకు ఆ ఆటో ఆచూకీ కోసం వెతికినా చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో ఆ కేసు అక్కడే నిలిచిపోయింది. కిడ్నాప్‌ అయిన మహిళ అపస్మారక స్థితిలో గుంటుపల్లి వద్ద దొరకడంతో పోలీసులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు తలకు తీవ్ర గాయం కావడంతో ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు తేల్చలేకపోయారు. అవే సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే వెంటనే ఆ సంఘటనకు సంబంధించిన నిందితులను అరెస్ట్‌ చేసే అవకాశం ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వీవీఐపీలు పర్యటించే ప్రాంతంలో కనిపించని సీసీ కెమెరాలు

నార్త్‌ సబ్‌ డివిజన్‌లో సీసీ కెమెరాల

కోసం భారీ మొత్తంలో విరాళాల

సేకరణ

నేటికీ కెమెరాలు ఏర్పాటు చేయని

పోలీసులు

నిందితులకు వరంగా నిఘా లోపం

మహిళ కిడ్నాప్‌ వ్యవహారంలో

గుర్తించలేని నిందితుడి జాడ

సీసీ కెమెరాల ఏర్పాటుకు భారీ విరాళాలు..

ఒక్కటి పనిచేస్తే ఒట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement