తాడేపల్లి: ‘రాష్ట్రంలోని రైతుల దుస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’అంటూ రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి గళమెత్తారు వైఎస్ జగన్. సేవ్ ఏపీ ఫార్మర్స్‌హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.
ఇదీ రైతుల దుస్థితి..
కిలో అరటిపండ్లు రైతుల వద్ద నుంచి రూ. 50 పైసలకే అమ్ముడవుతున్నాయని రాష్ట్రంలోని రైతుల దుస్థితికి ఇదే నిదర్శనమన్నారు. అగ్గిపెట్ట, బిస్కెట్ కంటే కూడా అరటిపండు చౌకయ్యిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే చివరకు రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది అని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అరటి పండ్లే కాదు ఉల్లినుంచి టమోట వరకూ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. మార్కెట్ లో మాత్రం అరటిపండ్లు రూ. 60 నుంచి 70 వరకూ విక్రయిస్తున్నారని అన్నారు. ఈ డబ్బులంతా మధ్యలోని దళారుల జేబుల్లోకే వెళుతున్నాయని రైతులకు మాత్రం రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదన్నారు. దీంతో ఆవేదనతో రైతులు తమ పంటను రోడ్లపై పడివేస్తున్నారన్నారు.
బొప్పాయి ధర కూడా మార్కెట్‌ను బట్టి మారిపోతుందని రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదన్నారు. ఉల్లి టమాట ధరలు కూడా మార్కెట్లో రూ1. నుంచి రూ.3 వరకూ పలుకుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేది ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అంతే కాకుండా విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఉచిత పంట బీమా లేదు. కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అరటి పండ్ల ధర టన్ను రూ. 25 వేలు పలికేదాని అంతేకాకుండా రైతులకోసం ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లు నడిపామన్నారు. తమ ప్రభుత్వంలో కృతనిశ్చయంతో రైతులకు ఎంతో మేలు చేశామని, రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు. కానీ నేడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్.
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.
Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025


