ప్లాస్టిక్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం | Fire in a plastic factory in Noida | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Jan 15 2018 9:11 AM | Updated on Oct 2 2018 4:26 PM

Fire in a plastic factory in Noida - Sakshi

న్యూఢిల్లీ: నోయిడాలోని శ్రీనివాస్‌పురిలో అర్థరాత్రి  ఓ ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండతస్తుల భవనంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్‌ వస్తువులకు మంటలు  వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 26 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement