కర్నూలు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది.
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రి గేటు పక్కన పడేసి వెళ్లిన సంఘటన జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. గేటు పక్కన ఉన్న ప్లాస్టిక్ కవర్‌లోంచి రక్తం వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రి వర్గాలకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరిశీలించగా ప్లాస్టిక్ కవర్‌లో అప్పుడే పుట్టిన బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు.