ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సురక్షితమేనా..? | plastic bottles are safe? | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సురక్షితమేనా..?

Apr 14 2017 7:27 PM | Updated on Sep 18 2018 6:38 PM

ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సురక్షితమేనా..? - Sakshi

ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సురక్షితమేనా..?

ఇకపై మీరు వాటర్‌ బాటిల్‌ కొని తాగడానికి ముందు దాని కిందభాగాన్ని ఒకసారి చూడండి.

ఇకపై మీరు వాటర్‌ బాటిల్‌ కొని తాగడానికి ముందు దాని కిందభాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి? ఎప్పుడైనా పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. ఎన్నో రకాల ప్లాస్టిక్స్‌ ఉన్నాయి కదా! వాటిలో ఏ తరహా ప్లాస్టిక్‌తో ఆ వాటర్‌ బాటిల్‌ తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్‌ కింద దానికి చెందిన లెటర్స్‌ను ప్రింట్‌ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది మంచిదో, ఏది హానికరమో కింద చూడండి.

పీఈటీఈ లేదా పీఈటీ - వాటర్‌ బాటిల్‌ కింద ఈ లెటర్స్‌ ప్రింట్‌ చేసి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్‌తో తయారు చేసిన వాటర్‌ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విషపదార్థాలు విడుదల అవుతాయట! ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మంచిది కాదట.

హెచ్‌డీపీఈ లేదా హెచ్‌డీపీ - వాటర్‌ బాటిల్‌ కింద ఈ లెటర్స్‌ ఉంటే అప్పుడు ఆ బాటిల్‌లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్‌ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి. మనకు ఎలాంటి హాని కలిగించవు.

పీవీసీ లేదా 3వీ - ఈ లెటర్స్‌ ఉన్నా జాగ్రత్తగా చూడాలి. ఎందకంటే ఈ ప్లాస్టిక్‌ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరుతాయి. అవి మన శరీరంలో హార్మోన్‌ అసమతుల్యతను కలిగిస్తాయి.

ఎల్‌డీపీఈ - ఈ ప్లాస్టిక్‌తో చేసిన వాటర్‌ బాటిల్స్‌ మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలో చేరవు. కానీ ఈ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ తయారీకి పనికిరాదు. దీంతో ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ను తయారు చేస్తారు.

పీపీ- పెరుగు కప్పులు, టానిక్‌లు, సిరప్‌లు ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్‌ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ను వాడుతారు. ఇది మనకు సురక్షితమే.

పీఎస్‌ - ఈ తరహ ప్లాస్టిక్‌తో కాఫీ, టీ కప్పులు తయారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్‌ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. కనుక ఈ తరహా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను వాడరాదు. లేబుల్‌ ఏమీ లేకపోయినా లేదా పీసీ అని ఉన్నా ఈ ప్లాస్టిక్‌ చాలా డేంజర్‌. జాగ్రత్త పడండి మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement