
పండగల సీజన్ వచ్చేసింది. బతుకమ్మ, దసరా సంబరాలతో త్వరలోనే దీపావళి పండుగ రానుంది. మరి ఫెస్టివ్ కళతో మహిళలు, ముద్దుగుమ్మలు తెగ ఆరాటపడతారు. అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా సహజంగా, మెరిసే పోవాలంటే ఏం చేయాలి? చిన్న చిన్న చిట్కాలతో అందరిలోను ప్రత్యేకంగా కనిపించాలంటే కొన్ని అమేజింగ్ టిప్స్ పాటిస్తే చాలు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటివి కొన్ని చూసేద్దామా.
పండగ హడావుడి, ఇంటి పనులతో ఫేస్ నిర్జీవంగా మారిపోయిందా? డోంట్ వర్రీ.. సహజసిద్ధమైన ఫేస్ మాస్క్‌లు, స్ర్కబ్‌లతో అందమైన చందమామలా మారిపోవచ్చు.
ముఖంపై బ్లాక్‌హెడ్స్ పోవాలంటే... క్యారట్ తురుములో పంచదార పొడి, ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని చేతి వేళ్ళతో ముఖంపై వలయాకారంలో మసాజ్ చేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మటుమాయమవుతాయి. ముఖంలో గ్లో వస్తుంది.
పచ్చి పాలతో ముఖాన్ని క్లిన్సింగ్ చేసుకోండి. పెరుగు,శనగపిండిలో కొద్దిగా కలబందను జోడించి ముఖానికి అప్లయ్ చేసి, ఆరిన తరువాత సున్నితంగా కడిగేసుకోండి. ఇవి అత్యంత ప్రభావవంతమైన చర్మ సంరక్షణ పద్ధతులు.. సున్నితమైన క్లెన్సర్ లేదా ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సహజ గ్లో ఇస్తుంది. ఆ తరువాత చర్మం మెరుపుకోసం ఎక్స్‌ఫోలియేషన్ అవసరం. వోట్ మీల్, పాలు లేదా చిక్‌పా పిండితో పాటు తేనె మిశ్రమాన్ని ఎక్స్‌ఫోలియేటర్‌లుగా ఉపయోగించవచ్చు. ఇది డెడ్ స్కిన్‌ని తొలగించి కాంతిని ఇస్తుంది.
కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున దీనిని కొన్నిసార్లు మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. ముఖంపై కొద్ది మొత్తంలో కొబ్బరి నూనెను మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత సాధారణ క్లెన్సర్‌తో క్లీన్ చేసుకోవాలి. కొబ్బరి అలెర్జీ ఉంటే మాత్రం దీనిని నివారించాలి.
15 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి.. హానికరమైన UV కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడం వల్ల చర్మం వృద్ధాప్య ప్రక్రియ నుండి కూడా రక్షిస్తుంది.
దుమ్ము, ధూళి వాతావరణానికి దూరంగా ఉండాలి.
మరీ వేడి నీళ్లతో స్నానం చేయవద్దు. దీనివల్ల ముఖ్యం నేచురల్ ఆయిల్స్ నష్టపోతాం.
సమతులం ఆహారం, ఎక్కువ నీరు,ప్రోబయోటిక్స్ ఫుడ్ తీసుకోవాలి పండ్లు , కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.శుద్ది చేసిన, ప్రాసెస్, ప్యాక్డ్ ఫుడ్, డీప్ ఫై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ, నూనె, ఉప్పు, చక్కెర అధిక వినియోగం శరీరానికి హాని చేస్తాయని గుర్తుంచుకోవాలి.
బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు, దోసకాయ, పాలకూర, బీట్ రూట్, క్యారెట్, యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీలతో కూడిన స్మూతీలను హెర్బల్ టీ తీసుకోవాలి.
రోజంతా ఉత్సాహంగా ఉండేలా నిద్ర లేచిన కొద్దిసేపటికే నెగటివ్ థాట్స్, చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ఇష్టమైన సంగీతం వినాలి. వ్యాయమాలు, క్రియేటివ్ వర్క్‌పై దృష్టి పెట్టాలి. వీటన్నింటితో కనీస వ్యాయామం చేయడం చాలా అవసరం.