బ్లాక్‌ ఫంగస్‌ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా? | Black Fungus on Onions: Health Risks and Expert Tips to Stay Safe | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ ఫంగస్‌ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?

Nov 1 2025 11:57 AM | Updated on Nov 1 2025 12:23 PM

The black layer on your onion could lead to health problems

మార్కెట్‌ నుంచి మన ఇంటికి ఉల్లిపాయలను తీసుకువచ్చినప్పుడు, చాలా సార్లు ఉల్లిపాయలో నల్లటి  పొర కనిపిస్తుంది. సాధారణంగా ఈ  పొర తొక్క లోపల కనిపిస్తుంది. మనం దీనిని ఏదో దుమ్ముగా భావించి, కడిగి వాడుకుంటాం. కానీ ఇది నల్లటి ఫంగస్‌. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.

బ్లాక్‌ ఫంగస్‌ ఉన్న ఉల్లిపాయలు తినడం వల్ల అది మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ ఉల్లిపాయల జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!

ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఒక రకమైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఇలాంటి వాటిని తినడం వల్ల మ్యూకోర్మైకోసిస్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఇన్ఫెక్షన్‌ చాలా హాని కలిగిస్తుంది. వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఉల్లిపాయల్ని తినకపోవడమే మేలు.

ఉల్లిపాయ నుంచి ఆ భాగాన్ని తీసివేసి తింటే అది ప్రాణాపాయం కలిగించదు. కానీ, ఇది కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అలెర్జీలు ఉన్నవారు ఇలాంటి ఉల్లిపాయల్ని తినకూడదు. అదేవిధంగా, ఉబ్బసం ఉన్నవారికి ఇది హానికరం. ఈ ఫంగస్‌ గాలిలో వ్యాపించి, ఉబ్బసం ఉన్న వ్యక్తి దానిని పీల్చినప్పుడు, అది హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయను ఒకటి లేదా రెండు  పొరలను తీసివేసిన తర్వాత మాత్రమే వాడండి లేదా ఉల్లిపాయలు కొనేటప్పుడు, తొక్క నల్లగా ఉండకుండా చూసుకోండి.

మరో ముఖ్య విషయం... ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ మీరు ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచాలనుకుంటే దానిపై ఎటువంటి నల్లటి ఫంగస్‌ ఉండకూడదు. అలా ఉంటే అది ఇతర ఆహార పదార్థాలతో కలిసిపోయి విషంగా మారుతుంది. అందుకే ఇలాంటి తప్పులు చేయకండి.

చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement