హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..! | Harsh Goenka Shares Recipe For Surat Style Ponk | Sakshi
Sakshi News home page

హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..

Dec 16 2025 4:23 PM | Updated on Dec 16 2025 4:30 PM

Harsh Goenka Shares Recipe For Surat Style Ponk

ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా స్వతహాగా ఆహారప్రియుడు. తరచుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లో ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అలానే ఈసారి కూడా గజగజ వణికించే ఈ చలిలో తనెంతో ఇష్టంగా తినే ఆహారాన్ని షేర్‌ చేశారు. దీన్ని శీతకాలపు చిరుతిండిగా అభివర్ణిస్తూ..ఆ రెసీపి తయరీతో సహా వివరించారు. నిపుణుల సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొనడం విశేషం.

గుజరాత్‌, మహారాష్ట్ర ప్రాంతాల కాలానుగుణ వంటకాన్ని నెట్టింట షేర్‌ చేశారు హర్ష్‌ గోయెంకా. ఇది శీతకాలపు చిరుతిండి అని, తనకెంతో ఇష్టమని అన్నారు. పోంక్‌ రెసిపీ వ్యవహరిస్తారని చెప్పారు. ఇది ఆకుపచ్చని జొన్నలు,నిమ్మకాయ, మఖానా, కొద్దిగా సేవ్‌ జోడించి తయార చేసి స్మోకీ వంటకమట. ఇది తింటుంటే స్వర్గానికి వెళ్లిపోవాల్సిందేనట. దీనికి వెల్లుల్లి చట్నీ జోడిస్తేనే మంచి రుచి వస్తుందని చెప్పారు గోయెంకా. 

ఎలా చేస్తారంటే..తాజా పోంక్‌(ఆకుపచ్చని జొన్నలని) పచ్చి వాసన పోయేదాక వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, నిమ్మరసం జల్లుకోవాలి. క్రంచిగా ఉండేలా మఖానా చక్కెర బంతులను జోడిస్తూ..స్సైసీ పంచ్‌ ఇచ్చేలా వెల్లుల్లి చట్నీ జోడిస్తే చాలట. కాస్త ఆకర్షణీయంగా కనిపించేలా క్రిస్పిసేవ్‌ చలులుకుంటే..ఎంతో రుచికరమైన పోంక్‌ రెడీ..!.

ఆరోగ్య లాభాలు..
ఇది కేవలం చిరుతిండి కాదు. లేత దశలో ఉండే ఈ జొన్నలు ప్రత్యేకమైన వగరు రుచి కలిగి నోటిలే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఫైబర్‌ మూలం. ఇందులో ఉపయోగించే జొన్నలు గ్లూటెన్‌ రహితంగా ఉంటాయి. 

అందువల గ్లూటెన్‌ అంటే పడినివాళ్లకి లేదా సెలియాక్‌ వ్యాధితో బాధపడేవారికి ఇది ఎంతో మంచిది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇది మంచి ఎనర్జీని అందివ్వడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలుగజేస్తుంది. అలాగే ఇందులో ఐరన్‌, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఇది మొత్తం ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

(చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్‌ పోలీసుగా సేవ!)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement