నవంబరులో కొదమసింహం | Chiranjeevi Kodama Simham will have re-release on nov 21st | Sakshi
Sakshi News home page

నవంబరులో కొదమసింహం

Oct 1 2025 2:40 AM | Updated on Oct 1 2025 2:40 AM

Chiranjeevi Kodama Simham will have re-release on nov 21st

చిరంజీవి కెరీర్‌లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘కొదమసింహం’ ఒకటి. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్‌ హీరోయిన్లుగా, మోహన్‌బాబు విలన్‌ పాత్రపోషించారు. కె. నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘన విజయాన్ని సాధించింది. ముప్పైఐదేళ్ల తర్వాత ఈ సినిమాని నవంబరు 21న రీ రిలీజ్‌ చేయనున్నట్లు రమా ఫిలింస్‌ అధినేత కైకాల నాగేశ్వరరావు తెలిపారు.

‘‘చిరంజీవి కౌబాయ్‌గా నటించి, ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘కొదమసింహం’. రాజ్‌–కోటి సంగీతం, మోహన్‌బాబు వినోదం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్‌ సౌండింగ్‌తో సరికొత్తగా నవంబరు 21న రీ రిలీజ్‌ చేయబోతున్నాం’’ అని కైకాల నాగేశ్వర రావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement