Pre Wedding Show: ఆకట్టుకుంటున్న‘వయ్యారి వయ్యారి’ సాంగ్‌ | Vayyari Vayyari lyrical video Song Out From Pre Wedding Show Movie | Sakshi
Sakshi News home page

Pre Wedding Show: ఆకట్టుకుంటున్న‘వయ్యారి వయ్యారి’ సాంగ్‌

Sep 30 2025 6:24 PM | Updated on Sep 30 2025 7:58 PM

Vayyari Vayyari lyrical video Song Out From Pre Wedding Show Movie

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని ’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్‌ 7 మూవీ రిలీజ్కానుంది. నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 

సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కె. సోమ శేఖర్, ఎడిటర్‌గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రజ్ఞయ్ కొణిగారి పని చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement