
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) పారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week) లో తళుక్కున మెరిసింది. ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో 51 ఏళ్ల వయసులో కూడా మెరిసిపోయింది .పారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్స్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2026 కలెక్షన్‌లో భాగమైన "లిబర్టే, ఎగలైట్, సోరోరైట్ (లిబర్టీ, ఈక్వాలిటీ, సిస్టర్‌హుడ్)" షో కోసం గ్లోబల్ బ్రాండ్ లోరియల్ పారిస్ తరపున ఐశ్వర్య రాయ్ ర్యాంప్‌పై నడిచారు.

భారతీయ హస్తకళను ప్రపంచ వేదికకు తీసుకెళ్లిన ఈ గ్లోబల్ ఐకాన్ మరోసారి భారతీయ దుస్తుల వైభవాన్ని చాటి చెప్పారు.
ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన (Manish Malhotra. )అద్భుతమైన బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇండిగోలో కస్టమ్-మేడ్ ఇండియన్ షేర్వానీలో ఐష్ లుక్ అదిరిపోయింది. మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ దుస్తుల వివరాలను పంచుకున్నారు. ఇది పారిస్ ఫ్యాషన్ వీక్ గొప్పతనాన్ని అందిస్తుందన్నారు. ఈ డిజైనర్ ఈ దుస్తులలో "10-అంగుళాల డైమండ్-ఎంబ్రాయిడరీ కఫ్‌లు, విలాసవంతమైన నెక్లెస్ లాగా పొడవైన లేయర్డ్ డైమండ్ స్కాలోప్‌లు, డైమండ్ టాసెల్ డ్రాప్ మరియు డైమండ్-స్టడ్డ్ యానిమల్ బ్రోచెస్" ఉన్నాయి..
నటి ధరించిన షేర్వానీలో వజ్రం-స్టడ్డ్ బటన్‌లతో స్ప్లిట్ నెక్‌లైన్‌తో కూడిన ఎత్తైన బంధ్‌గాలా కాలర్ ఉంది. ప్యాడెడ్ భుజాలు, పూర్తి-పొడవు స్లీవ్‌లు, సైడ్ మరియు ఫ్రంట్ స్లిట్‌లు , బాడీ-హగ్గింగ్ సిల్హౌట్ దుస్తులకు ఫ్లేర్డ్ ప్యాంటు ఫిట్ జత చేశారు. వీటితోపాటు ఐశ్వర్య రాయ్ హై హీల్స్, డైమండ్ ఇయర్ స్టడ్‌లు మరియు స్టేట్‌మెంట్ డైమండ్ రింగులను ధరించారు. ఆమె జుట్టును వదులుగా వదిలి, ఆమె సిగ్నేచర్ స్టైల్‌లో ఒక వైపున విడదీసి, తన దుస్తులకు ఆర్కిటెక్చరల్ బోల్డ్‌నెస్‌కు రొమాంటిక్ టచ్‌ను జోడించి మరింత గ్లామర్‌గా మెరిసారు.