బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ పాల్గొన్న ఒప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఒప్రా ఐశ్వర్య, అభిషేక్‌ల పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించగా ఆ దృశ్యాలు ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి.
భారతీయ పెళ్లిళ్ల ప్రత్యేకతపై మాట్లాడిన అభిషేక్ బచ్చన్, “భారతీయులు సంబరాలు చేసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు. అందుకే మా పెళ్లి వేడుక కూడా అనేక రోజులు కొనసాగింది” అని తెలిపారు.
అయితే ఒప్రా “ఇంత పెద్ద పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం కష్టం కదా?” అని ప్రశ్నించగా దానికి ఐశ్వర్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “మేం ఆ ఆలోచనను ఏ మాత్రం మనసులోకి రానివ్వం” అని స్పష్టంగా సమాధానమిచ్చింది.
 
ఆ సమాధానంతో ఐశ్వర్య రాయ్‌కు భారతీయ వైవాహిక బంధంపై ఉన్న నిబద్ధతను, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించిందని అభిమానులు పేర్కొంటున్నారు. ఆమె మాటలతో బచ్చన్ జంట మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.