ఏపీలో ‘కాంతార: చాప్టర్‌ 1’ టికెట్‌ ధరలు పెంపు.. ఎంతంటే? | Kantara : Chapter 1 Ticket Hikes In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘కాంతార: చాప్టర్‌ 1’ టికెట్‌ ధరలు పెంపు.. ఎంతంటే?

Sep 30 2025 7:12 PM | Updated on Sep 30 2025 8:10 PM

Kantara : Chapter 1 Ticket Hikes In Andhra Pradesh

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన ‘కాంతారా ఛాప్టర్‌-1’(Kantara : Chapter 1) సినిమా టికెట్‌ ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంపునకు అనుమతి ఇస్తూ ఉతర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ప్రీమియర్స్కి కూడా అనుమతి ఇచ్చింది

అక్టోబర్‌ 1 రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్షో పడనుంది. దీనికి కూడా పెంపు వర్తిస్తుంది. అలాగే అక్టోబర్‌  2 నుంచి 11 వరకు సింగిల్స్క్రీన్లలో రూ. 75, మల్లిప్లెక్స్లలో రూ. 100 పెంచుకునే వెలుసుబాటుని కల్పించింది.

కాంతార: చాప్టర్ 1 విషయానికొస్తే.. పాన్ఇండియా బ్లాక్బస్టర్‌ ‘కాంతారచిత్రానికి ప్రీక్వెల్ఇది. ఈ చిత్రాన్ని రిషబ్శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement