
పంజగుట్ట: ఓజీ సినిమాను తీసిన డీవీవీ క్రియేషన్స్‌పై త్వరలో పరువునష్టంతో పాటు, కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని న్యాయవాది బర్ల మల్లేష్ యాదవ్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓజీ సినిమా టికెట్ల రేట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తాను కోర్టులో పిటీషన్ వేయగా..రేట్లు పెంపుదలను కోర్టు నిలిపివేసిందన్నారు.
ఈ నేపథ్యంలో తనను అవమాన పరుస్తూ డీవీవీ క్రియేషన్స్ వారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేసేలా ప్రోత్సహించారని మల్లేష్ ఆరోపించారు. దీనిపై తాను మళ్లీ కేసు వేస్తానని చెప్పారు. పేదలకు వినోదం తక్కువ ధరకే అందాలనే ఉద్దేశంతోనే తాను టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకించానని పేర్కొన్నారు.