సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమ నెట్టింటకు చేరింది.
గన్నవరం ఎయిర్‌పోర్టులో జగన్‌ను చూసేందకు ఓ వ్యక్తి తన కూతురితో కలిసి వచ్చారు. ఆ బాలిక చెప్పు కాలి నుంచి జారిపోయింది. అది గమనించిన వైఎస్ జగన్ ఆమె చెప్పును అందించి.. ఆ చిన్నారిని ఆప్యాయంగా స్పృశించారు. తద్వారా పిల్లల పట్ల తనకు ఉండే ఆప్యాయతను మరోసారి ప్రదర్శించారు. అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో ఆ క్షణాలను బంధించగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది.
Man of Simplicity – YS Jagan ✨🙏💙 pic.twitter.com/KqxTnqpEvP
— Johny Kaki (@johny_kaki) December 2, 2025


