
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు. ఎన్నో రోజుల వెయింటింగ్‌కు ఎండ్ కార్డ్ పడేశారు. తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. సంజయ్ దత్ విలన్ రోల్ మరింత అగ్రెసివ్‌గా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిమిషాల 34 సెకన్ల నిడివితో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.