
‘‘నా ఇరవయ్యేళ్ల వయసులో విశ్రాంతి లేకుండా గందరగోళంలో గడిపాను... గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. నా ఫీలింగ్స్ ఏవీ పైకి కనిపించకుండా ఉండేందుకు కష్టపడ్డాను. ఈ క్రమంలో నన్ను నేను ఎంత కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో ప్రేమ గురించి నాకెవరూ చెప్పలేదు. కానీ నిజమైన ప్రేమ మనలోనే దాగి ఉంటుందని, మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఆ తర్వాత అర్థం చేసుకున్నాను’’ అని పేర్కొన్నారు సమంత.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆలోచనలను, అబీప్రాయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంటారు సమంత. తన మేకప్‌మేన్‌తో ఓ సుదీర్ఘమైన చర్చ జరగిందని, ఈ చర్చలో ఎన్నో అంశాలను మాట్లాడుకున్నామని పేర్కొని, వాటిలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, ఇన్‌స్టాలో ఓపోస్ట్ షేర్ చేశారు సమంత. ‘‘ముప్పైఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే తీరు మారిపోతుంది.
మీ అందంలో మార్పులొస్తాయి. ఇప్పుడు నేను ముప్పై ఏళ్లలో ఉన్నాను. ప్రతిదాని వెంట పరుగులు పెట్టడం ఆపేసి, జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో నేను చేసిన తప్పుల తాలూకు జ్ఞాపకాలను మోయడం ఆపేశా. పబ్లిక్‌లో ఒకలా... ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా... ఇలా రెండు రకాలుగా ఉండటం మానేశాను. ఎందుకంటే మీరు మీలా ఉన్నప్పుడే హ్యాపీగా... స్వేచ్ఛగా జీవించగలరు’’ అని ఆపోస్ట్‌లో పేర్కొన్నారు సమంత.