నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా.. | Viral Video: Lion Guarding Durga Temple in Gir Forest Stuns Devotees | Sakshi
Sakshi News home page

నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..

Sep 30 2025 11:29 AM | Updated on Sep 30 2025 12:01 PM

IFS Officer Shares Incredible Video Of Lioness Guarding Temple Goes Viral

ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్‌తో ఏది రియల్‌, ఏది ఫేక్‌ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది న‍మ్మదగినది కాదో అ‍న్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్‌ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..

ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ షేర్‌ చేయడంతో అది రియల్‌ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. 

అయితే ఇది గిర్‌ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్‌ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్‌లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. 

ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్‌ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా,  2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

 

(చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement