చైనాలో మరో అద్భుతం.. | China Opens Longest Expressway Tunnel Video Viral | Sakshi
Sakshi News home page

చైనాలో మరో అద్భుతం..

Dec 27 2025 11:39 AM | Updated on Dec 27 2025 11:50 AM

China Opens Longest Expressway Tunnel Video Viral

బీజింగ్‌: చైనా మరో అడుగు ముందుకేసి అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే సొరంగాన్ని ప్రజా రవాణా కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం ద్వారా 7 గంటల ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

డ్రాగన్‌ దేశం చైనాలో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే సొరంగం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22.13 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే సొరంగం టియాన్‌షాన్ షెంగ్లీ టన్నెల్ డిసెంబర్‌ 26 శుక్రవారం అధికారికంగా ట్రాఫిక్‌కు ప్రారంభించారు. ఇది వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లోని సెంట్రల్ టియాన్‌షాన్ పర్వతాలను దాటి, గతంలో కొన్ని గంటలు పట్టే పర్వత ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.

 

ఇదిలా ఉండగా.. చైనా శుక్రవారమే మరో ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ జిన్జియాంగ్‌లోని పట్టణ సముదాయాలను కలిపే మరొక ముఖ్యమైన సహాయక సొరంగం G0711 ఉరుంకి-యులి ఎక్స్‌ప్రెస్‌వే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని టియాన్షాన్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది రెండు సమాంతర గొట్టాలుగా రూపొందించబడింది. ఒక్కొక్కటి రెండు లేన్ల ట్రాఫిక్‌ను కలిగి ఉంటాయి. ఇది ఉత్తర జిన్జియాంగ్‌లోని ఉరుంకిని దక్షిణాన యులికి కలిపే ఉరుంకి-యులి ఎక్స్‌ప్రెస్‌వేలో భాగం. ఈ సొరంగం 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడింది. సొరంగం ప్రారంభంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement