breaking news
	
		
	
  dusara
- 
      
                   
                                                       నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్‌తో ఏది రియల్, ఏది ఫేక్ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది నమ్మదగినది కాదో అన్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేయడంతో అది రియల్ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. అయితే ఇది గిర్ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్‌లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025 (చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..)
- 
      
                   
                                                       రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే..సాక్షి, సిటీబ్యూరో: దసరా, దీపావళి (Dasara - Diwali) వరుస పండుగలతో సందడి మొదలైంది. షాపింగ్, వాహనాల కొనుగోళ్లతో ఇల్లంతా హడావుడిగా తయారవుతోంది. పండగ సీజన్ ప్రారంభం కావడంతో ఇంటికి రంగుల్ని వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే శుభ్రం చేయడం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. హడావుడి లేకుండానే ఓ పద్ధతి ప్రకారం ఇంటిని అలంకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అందనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే.. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది.కార్పెట్లు: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. తరచూ వ్యాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాల్సిందే.. దుమ్ముతో కార్పెట్ కళావిహీనంగా కనిపించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనె, సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరకలు తొలిగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యుమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి.గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లతో శుభ్రం చేయాలి. గోడల్ని గట్టిగా రుద్దవద్దు.వంటింట్లో: బాత్ ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయి. స్నానాల గదిలో, వంటిట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కాహాల్‌తో తుడవాలి. నల్లాపై మరకల్ని టూత్‌పేస్టుతో తుడిచి తొలగించవచ్చు.ఇదీ చదవండి: మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్ నిర్ణయం
- 
      
                   
                                                       కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో..విభిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో మినీ భారత్‌ను తలపిస్తోంది హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ. విభిన్న ప్రాంతాలకు చెందిన వారు విభిన్న రీతుల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి కలసికట్టుగా నవరాత్రులు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు అగర్వాల్ కుటుంబీకులు, మరాఠాలు, కన్నడిగులు, బెంగాలీలు తమతమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన కన్నడిగులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామ జుమ్లా పాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కన్నడిగులు దసరా వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దుర్గామాత చిత్రపటం వద్ద నల్లరేగడి మట్టిలో నవధాన్యాల విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తడంతో తొమ్మిది రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవధాన్యాల మొలకలు పెరిగిన ఎత్తు అమ్మవారి కటాక్షానికి కొలమానంగా భావిస్తారు. కన్నడిగుల అష్టమి కడాయి.. దుర్గాష్టమి సందర్భంగా గోధుమ పిండితో అమ్మవారి ఆభరాలను తయారు చేస్తారు. వీటిని కడాయిలో వేసి వేపుతారు. అమ్మవారి పుస్తె, మట్టెలు, జడ వంటి ఆభరణాలను తయారుచేసి అమ్మవారి విగ్రహం చుట్టు వేలాడదీస్తారు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చే బంధు మిత్రులకు వీటిని అందజేసి దసరా శుభాకాంక్షలు చెబుతారు. ఉపవాసం అనంతరం.. తొమ్మిది రోజుల ఉపవాసం అనంతరం విజయ దశమినాడు జమ్మిచెట్టు పూజతో పాటు చెరుకుగడ, బంగారం ఇస్తూ ఆలింగనం చేసుకుంటారు. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. బెంగాలీలకు ఐదు రోజులే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇదే వారి ప్రధాన పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకూ ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ దశమి రోజు నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో దుర్గామాత వద్ద మేకలను బలిస్తామని.. ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను ప్రసాదంగా పెడతామని తెలిపారు. మొదటి రెండు రోజులు శాకాహారం, మిగిలిన రెండు రోజులు మాంసాహారం భుజిస్తారు. అగర్వాల్ ఉపవాస దీక్షలు.. ఉత్తర భారతీయులైన అగర్వాల్ కుటుంబీకులు తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. గోడకు పటం వేసి గోధుమలు, జోన్నలు మట్టి కుండలో పెడతారు. మొలకెత్తిన విత్తనాల ఆకులను విజయదశమి రోజు తలపాగలో, చెవులపై ధరించి పాదాభివందనం చేస్తారు. విజయ దశమి నాడు 2–8 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది బాలికలను ప్రత్యేకంగా పూజించి తాంబూలం సమరి్పస్తారు. ఈ సందర్భంగా పూజా తాలీ పోటీలు నిర్వహిస్తారు. ఐక్యతకు నిదర్శనం.. మేము ఉత్తర భారతీయులమైనప్పటికీ దశాబ్దాలుగా నగరంలో జీవిస్తూ కలసిమెలసి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దసరా వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఇది శక్తి, ఐక్యతకు నిదర్శనం. శ్రీరాముని విజయమైనా, దుర్గామాత పూజ అయినా రెండూ శక్తి ఆరాధన రూపాలే. – పంకజ్ కుమార్ అగర్వాల్, హైదరాబాద్ కుంభమేళా అగర్వాల్ సమితి అధ్యక్షులు కోల్‌కతా మాదిరిగానే.. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కోల్‌కతాలో నిర్వహించినట్లుగానే ఇక్కడా నిర్వహిస్తాం. ఐదు రోజులపాటు బెంగాలీ మాతను పూజించి, అనంతరం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తాం. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – జగన్నాథ్ అడక్, బెంగాలీ యంగ్ స్టార్ అసోసియేషన్ అధ్యక్షులుకలిసి మెలిసి ఉత్సవాలు ఏన్నో ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మేమంతా ఇక్కడ కలిసి మెలసి ఉత్సవాలు చేసుకుంటాం. ఇది నిజాం కాలం నుంచి వస్తోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా..ఉత్సవాలను మాత్రం మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్నాం. ఇక దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో..అదే పద్ధతిలో ఇక్కడా నిర్వహిస్తున్నాం. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. – డాక్టర్ నాగ్నాథ్ మాశెట్టి, టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షులు
- 
      
                   
                                 మహిష దసరా వివాదం ఏమిటి? బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?కర్నాటకలోని మైసూరులో అక్టోబరు 13 నుంచి మహిష దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఇవి రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దసరా నేపథ్యంలో సాంస్కృతిక నగరమైన మైసూర్ అందంగా ముస్తాబైంది. ప్యాలెస్ భవనంలో నూతన బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు. కాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ స్నేహమహి కృష్ణ అనే వ్యక్తి మైసూర్ 8వ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం మహిష దసరా ఆచారణ కమిటీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 11వ తేదీకి వాయిదా పడింది. 2015 నుంచి దళిత అనుకూల సంస్థలు, అభ్యుదయవాదులు మైసూర్లో మహిష దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిష దసరా వేడుకల నిర్వహణకు అవకాశం కలగలేదు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మహిష దసరా వేడుకల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. మహిష దసరా వేడుకలపై ఎంపీ ప్రతాపసింహ తదితరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మహిష దసరా వేడుకలు జరగనివ్వబోమని ఆయన అన్నారు. కాగా ఈసారి 50 ఏళ్ల మహిష దసరా వేడుకలు జరుపుకుంటున్నట్లు మహిష దసరా వేడుకల కమిటీ పోస్టర్‌ను విడుదల చేసింది. మహిష దసరా సెలబ్రేషన్ కమిటీ, మైసూర్ యూనివర్సిటీ పరిశోధకుల సంఘం అక్టోబర్ 13న మహిష దసరా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాయి. చాముండి కొండను మహిష కొండగా పేర్కొంటూ ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేశారు. ఈ నేపధ్యంలో మహిష దసరా వివాదాస్పదమయ్యింది. మహిష దసరా వేడుకలను వ్యతిరేకించాలని బీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మహిషుని పేరుతో ఉత్సవాలు నిర్వహించడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే మహిష దసరా కమిటీ దీనిపై స్పందిస్తూ ‘మహిషను రాక్షసునిగా తప్పుగా అభివర్ణించారన్నారు. మైసూరు రాజు మహిష పరిపాలనను నాటి ప్రజలు ఎంతో ఇష్టపడేవారన్నారు. అందుకే మహిష దసరా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత?
- 
  
      దసరా విషెస్ చెప్పిన షమీ ..దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్
- 
  
      దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగిన దేవి నవరాత్రి ఉత్సవాలు
- 
  
      మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి : కొడాలి నాని
- 
  
      దసరా సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోదీ
- 
  
      నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీ
- 
  
      ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
- 
  
      ఇంటింటా దసరా...
- 
  
      విజయాలనిచ్చే విజయదశమి...
- 
  
      విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
- 
  
      కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
- 
  
      పది రోజులపాటు పది అవతారాల్లో దుర్గాదేవి
- 
      
                   
                                 ఈ దసరా పండగకు ప్రముఖ పుణ్యక్షేత్రం మూసివేతపూరీ: ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతండే పూరీ జగన్నాథుని ఆలయాన్ని కోవిడ్ -19 దృష్ట్యా కొత్త నిబంధనల కారణంగా తొమ్మిది రోజులు మూసేస్తున్నట్లు అలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జగన్నాథుడు 'సున భేష' (బంగారు వస్త్రధారణ)లో దర్శనమిస్తాడు. పైగా ఈ దసరా సమయంలో భక్తుల తాకిడి అధికమవుతుందన్న నేపథ్యంలోనే వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్రిమూర్తులు భగవాన్ బలభద్రడు, దేవి సుభద్ర దేవి జగన్నాథుడుని దసరాలో విజయ దశమి పర్వదినం రోజుతో సహా సంవత్సరంలో ఐదుసార్లు 'సునా భేస' (బంగారు వస్త్రధారణతో) అలంకరిస్తారు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) అయితే ఈ ఉత్సవానికి 12వ శతాబ్దకాలం నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి ప్రత్యేకతను సంతరించకున్న ఈ దర్శనం కోసం ఏటా కొన్ని లక్షల మంది భక్తులు ఆర్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే మళ్లీ అక్టోబర్ 20 నుంచి ఆలయం తెరిచి ఉంటుందని, ఈ మేరకు ప్రజలు యథావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు వచ్చే నెలలో 'దీపావళి' (నవంబర్ 4), 'బడా ఏకాదశి' (నవంబర్ 15) 'కార్తీక పూర్ణిమ' (నవంబర్ 19) వంటి పర్వదినాల్లో కూడా ఆలయానన్ని మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!)
- 
      
                   
                                 దసరా మామూళ్లు.. నగలు, నెక్లెస్‌లు!‘‘మీ లైసెన్స్ రెన్యూవల్‌కుచాలా ఇబ్బందులు ఉన్నాయి..నాకు లంచం వద్దు.. అసలుమా వంశంలోనే ఎవరూ లంచంతీసుకోలేదు. కానీ, నా కూతురికి చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అది కూడాఓ నాలుగు లక్షల నెక్లెస్ అంతే’’.. ‘‘రూ.70 లక్షల బిల్లు మంజూరు చేస్తే నాకేంటి.. అలాగని నేను లంచం తీసుకునే మనిషిని కాదు.. కేవలం 5 శాతం కమీషన్. అంటే మూడు లక్షల యాభై వేలు ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది. ఇందులో నాకేం మిగలదు.. నేనూ పైవారికి ఇచ్చుకోవాలి’’ సాక్షి, హైదరాబాద్: దసరా పండగ కోసం చాలామంది ప్రభుత్వాధికారులు లంచాల కోసం అడ్డదారులు తొక్కారు. ఈ క్రమంలో ఎక్కడా లంచం అన్న మాటే వాడలేదు. వాటికి బహుమతులు, కమీషన్లు ఇలా రకరకాల పేర్లు చెప్పి వసూలు చేశారు. వీరిలో పాతికేళ్ల సీనియర్ల నుంచి డ్యూటీలో చేరి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తికాని వారుండటం గమనార్హం. ఒకరిని చూసి మరొకరు లంచాల వసూళ్లలో పోటీ పడ్డారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కి దసరా ముందు అనేక మంది లంచాల పీడితులు తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారందరికీ ఉచ్చు బిగించిన ఏసీబీ అధికారులకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 12 (దసరా) వరకు ఏకంగా 12 మంది చిక్కడం గమనార్హం. అంటే సగటున ప్రతీ నాలుగు రోజులకు ఒకరు చొప్పున ఏసీబీ వలలో చిక్కారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏసీబీలో నమోదైన కేసుల జాబితా దాదాపు 130కి చేరింది. పకడ్బందీగా బుక్ చేస్తోన్న ఏసీబీ.. సాక్ష్యాధారాల సేకరణలో ఏసీబీ రూటుమార్చింది. తమ వద్దకు వచ్చిన బాధితుల విషయాలను ధ్రువీకరించుకునేందుకు కొంత సమయం తీసుకుంటోంది. తరువాత సదరు అధికారిని జాగ్రత్తగా ట్రాప్ చేస్తారు. అతని ఫోన్‌కాల్స్ సంభాషణలు, లంచం తీసుకుంటుండగా రహస్య వీడియో తీయడం వరకు అంతా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిందితుడికి న్యాయస్థానంలో కచ్చితంగా శిక్ష పడేలా ఆధునిక సాంకేతికత సాయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘‘గతంలో లాగ కాదు..ఇపుడు ఏసీబీ కేసులో చిక్కుకుంటే బయటపడటం దాదాపుగా అసాధ్యం’’ అని ఓ ఏసీబీ ఉన్నతాధికారి చెప్పారు. నెక్లెస్ గిఫ్ట్‌గా.. ఇటీవల హైదరాబాద్‌లో ఓ బ్లడ్‌బ్యాంక్ లైసెన్స్ రెన్యూవల్ విషయంలో అప్పటికే రూ.50 వేలు లంచం తీసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి.. మరింత లంచం కోసం గిఫ్ట్‌కింద రూ.1.10 లక్షల నెక్లెస్‌ని అడిగింది. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో, ఏసీబీ అధికారులు నెక్లెస్ షాపింగ్ మొత్తం ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో సహా రెడ్çహ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండునెలలకే లంచం.. తుర్కయాంజల్ వీఆర్వో శేఖర్ తన వద్దకు భూమి మ్యుటేషన్ కోసం వచ్చిన ఓ రైతు వద్ద రూ.లక్ష లంచం అడిగాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో వారు వలపన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. నిందితుడు శేఖర్ వీఆర్వోగా చేరి అప్పటికి కేవలం రెండు నెలలే అయింది. తోటివారి అవినీతి చూసిన శేఖర్ అక్రమమార్గం పట్టినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
- 
      
                   
                                 మార్కెట్లో కల్తీ జోరు..
 
 పండుగపూట ప్రజలకు అంటగడుతున్న వైనం 
 
 పెరుగుతున్న అక్రమ రవాణా దందా
 
 కానరాని అధికారుల పర్యవేక్షణ 
 
 కోల్‌సిటీ : పండుగ పూట మార్కెట్లో కల్తీ సరుకుల అమ్మకాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు విచ్చలవిడిగా నాణ్యత లేని సరుకులు తెప్పించి ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నియంత్రించాల్సిన ‘మామూలు’గానే భావిస్తున్నారు. 
 నగరం అడ్డా...
 గోదావరిఖని నగరం కల్తీ నిత్యావసర ఆహార వస్తువులు విక్రయించడానికి అడ్డాగా మారింది. వే–బిల్లులు లేకుండా నకిలీ, కల్తీ సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి గోదావరిఖనికి దిగుమతి చేస్తున్నారు. స్థానికంగా ఉండే కొన్ని కిరాణం, జనరల్ స్టోర్స్‌ల్లో కల్తీ సరుకులను బహిరంగంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు నకిలీ సరుకులను భారీ మొత్తంలో అక్రమంగా దిగుమతి చేస్తున్నారు. కంపెనీ చిరునామా కూడా లేని వంట నూనెను డ్రమ్ముల్లో బహిరంగంగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నూనెను ఇతర కంపెనీ డబ్బాల్లో నింపుతూ జనానికి అంటగడుతున్నారు. 
 అంతా కల్తీయేనా...?
 బియ్యంలో నాసిరకం బియ్యం, కంది పప్పులో కేసరిపప్పు, వంట నూనెలో పత్తి, సోయా, పామాయిల్, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె కలిపి కల్తీ చేస్తున్నారు. కారం, ఉప్పు, చాయపత్తి, మిరియాలు, జిలకర, శనిగపప్పుల్లో కూడా కల్తీ జరుగుతోంది. అసలు ఎందులో కల్తీ జరిగిందో కూడా వినియోగదారులు కనిపెట్టలేని విధంగా కల్తీ జరుగుతోంది.
 బోర్డుల్లేని విక్రయ షాపులు...
 రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక కిరాణ, జనరల్ స్టోర్లకు పేర్లు కూడా లేకుండానే నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కల్తీ సరుకుల విక్రయాలపై, బోర్డులు లేకుండా ఏళ్ల తరబడి అక్రమంగా నిర్వహిస్తున్న వ్యాపారులపై అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు చేస్తున్న సంబంధిత అధికారులు, వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ సరుకులతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మరోవైపు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ విక్రయాలు జరుపుతున్న వ్యాపారులు, కల్తీ సరుకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
- 
            
                                     
                                                             ఇంద్రకీలాద్రిపై దసరా సందడి


