
యువ వ్యాపారవత్త, అంబానీ వారసురాలు ఇషా అంబానీ తన ఫ్రెండ్ పెళ్లిలో స్టైలిష్ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అలెశాండ్రో మిచెల్ డెబ్యూ వాలెంటినో కలెక్షన్‌కు చెందిన డిజైనర్ వేర్‌లో తళుక్కుమంది. ఆత్మవిశ్వాసం, హుందాతనంతో కూడిన అద్భుతమైన అందంతో తన తల్లి నీతా అంబానీలాగానే లగ్జరీ అండ్ ఫ్యాషన్ స్టైల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇషా అంబానీ.
క్రీమ్ కలర్, పాస్టెల్ గ్రీన్ కలర్‌లో, అల్లికలు ,లేయర్డ్ రఫ్ఫ్లే ఎంబ్రాయిడరీ, క్లాసిక్ లగ్జరీగా రూపొందించిన ఈ గౌను ఇషా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేశాయి. ఇంకా అద్భుతమైన పూల ఆకారపు డైమండ్ చెవిపోగులు, అందమైన బంగారు బ్రాస్‌లెట్ , అద్భుతమై సెంటర్ స్టోన్‌తో డైమండ్ రింగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.
(పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!)
ఫ్యాషన్ ఐకాన్ ఇషా అంబానీ తన సన్నిహితులతో వేడుకలకు హాజరైంది. దీని ధర దాదాపు రూ. 5 లక్షలు. అంబానీ ఫ్యామిలీ ఇన్‌స్టా పేజ్ ఇషా అంబానీ ఫోటోలను షేర్ చేసింది. ఈ వెడ్డింగ్‌లో ఆమె లుక్ మోడ్రన్ ఫ్యాషన్ అభిరుచిని ఆమె గ్లోబల్ స్టైల్‌ని సూచిస్తుందంటూ ఫ్యాన్స్ పొగిడేశారు. ఇటాలియన్ లగ్జరీ హౌస్ క్రియేటివ్ కలెక్షన్స్ సంచలనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వాలెంటినో కలెక్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మరోవైపు ఇషా అంబానీకి వాలెంటినో కలెక్షన్ అంటే చాలా ప్రేమ. ఈ లగ్జరీ బ్రాండ్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో వాలెంటినో లెహంగానే ధరించింది. ఈ ఫ్యాషన్ హౌస్ రూపొందించిన మొదటి లెహంగా ధరించడం, అనేక సందర్భాల్లో ఈ కలెక్షన్ దుస్తులకే ఆమె ప్రాధాన్యత.
చదవండి: స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లీషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి!
కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్-నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ప్రస్తుతం రిలయన్స్‌రీటైల్ బాధ్యతల్లో విజయ పథంలో దూసుకుపోతోంది. 2018లో డిసెంబర్‌లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది ఇషా. ఈ జంటకు ఆదియా శక్తి, కృష్ణ కవల పిల్లలున్నారు.