
విద్యాబుద్దులుచెప్పే గురువు గారంటే పిల్లలకు చాలా అభిమానం. ఆరు నూరు అయినా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు చదువుకునే పిల్లలు. అంత గురి నమ్మకం తమ టీచర్లంటే.. మరి అలాంటి టీచర్లే భయంకరమైన తప్పులు రాస్తే.. ఇక వారి వద్ద విద్యనభ్యసించే పిల్లల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలిస్తే. ఎవరైనా అయ్యో.. రామ! అని నోరెళ్ల బెట్టాల్సిందే.
హిమాచల్ ప్రదేశ్‍లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కే ఇపుడు హాట్‌టాపిక్. ఈ చెక్ మీద ఉన్న ఇంగ్లిషు భాషను చూసి బ్యాంకు తిరస్కరించింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కు ఇచ్చారు. అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఉందీ చెక్. సాధారణంగా చెక్ ఇచ్చేటపుడు అక్రమాలకు తావులేకుండా ఆ మొత్తాన్ని అక్షరాల్లో (Inwords) రాయాల్సి ఉంటుంది. అలా తానిచ్చిన రూ. 7,616 ఇంగ్లిషులో భయంకరమైన తప్పిదం చేశారు. ఒక వర్డ్ అంటే పొరబాటు అనుకోవచ్చు. ఇంగ్లీష్‍లో సెవెన్ ( Seven) రాయాల్సిన చోట సావెన్ (Saven)అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ (Hundred) కు బదులు హరేంద్ర (Harendra, సిక్స్ టీన్‍కు బదులు సిక్స్టీ అని రాశారు. తప్పుల తడక చెక్కు చూసి బ్యాంక్ అధికారులే విస్తుపోయారు. అందుకే వెనక్కి పంపించారు.
₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”
📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है।
▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025
ఈ ఘటనకు సంబంధించిన చెక్ సోషల్‌మీడియాలో వౌరల్ అవుతోంది. నెటిజన్ల ఛలోక్తులు, వ్యాఖ్యాలు వెల్లువెత్తాయి. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్‌లో లోపం.." ఒకరు చమత్కరించగా, స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇన్ని తప్పులు రాస్తే ఇక చదివే పిల్లల పరిస్థితేమిటని మరికొందరు వాపోయారు.