‘సూర్యాపేట్‌ జంక్షన్‌’రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Suryapet Junction Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘సూర్యాపేట్‌ జంక్షన్‌’రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Apr 20 2025 2:02 PM | Updated on Apr 20 2025 3:49 PM

Suryapet Junction Movie Release Date Out

ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా  అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ...ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన "మ్యాచింగ్.. మ్యాచింగ్" సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా సహజంగానే ఉంటాయి. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లలో చూసి మీరందరూ మమ్మల్ని అదరిస్తారని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ... "మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ గారికి, రాంమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సూర్యాపేట్ జంక్షన్ సినిమాని థియేటర్ లలో ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement