భర్త దూరమైనా.. పిల్లల కోసం పోరాడి బిగ్‌బాస్‌లోకి | Rajakumari Dayana Selected for Bigg Boss | Sakshi
Sakshi News home page

భర్త దూరమైనా.. పిల్లల కోసం పోరాడి బిగ్‌బాస్‌లోకి

Aug 22 2026 11:37 AM | Updated on Aug 22 2026 12:24 PM

Rajakumari Dayana Selected for Bigg Boss

తూర్పుగోదావరి: రాజానగరం మండలంలోని తోకాడకు చెందిన గృహిణి రాజకుమారి డయానా రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 10కు 15వ కంటెస్టెంట్‌గా ఎంపికైంది. స్టార్‌ మా నిర్వహిస్తున్న అగ్ని పరీక్ష–2లో ఆమె ప్రతిభ చూపి, తన జీవితంలో ఒడిదొడుకులను వివరించి అందరినీ ఆకట్టుకుంది. భర్త ఏమాత్రం పట్టించుకోకపోయిన తన  ముగ్గురు పిల్లల భవిషత్తు కోసం జీవన పోరాటం చేస్తున్నానంటూ జడ్జీలను సైతం కంట తడి పెట్టించింది. 

చిన్నతనం నుంచి నటన అంటే ఎంతో ఇష్టమని, ఇన్‌స్ట్రాగామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన కలలను సాకారం చేసుకుంటున్న తరుణంలో జరిగిన బైక్‌ యాక్సిటెంట్‌ జీవితాన్ని మలుపు తిప్పిందని, అసలే నల్లగా ఉండే తనకు ఆ ప్రమాదం ద్వారా ముఖంపై తీవ్రగాయాలయని, పిల్లలు కూడా దగ్గరకు రావడానికి భయపడేవారని, అద్దంలో చూసుకుంటే తనకే భయం వేసేదని వివరించింది. 

అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా మనోనిబ్బరంతో రీల్స్‌ కొనసాగించి మోడలింగ్‌ చేసింది. ‘భయం’ పేరుతో ఆమె తీసిన షార్ట్‌ ఫిల్మ్‌కి ‘బెస్ట్‌ యాక్టర్‌’ అవార్డు కూడా వచ్చినట్టు ఆమె పేర్కొంది. ‘పిల్లలకు మంచి భవిషత్తును ఇవ్వడం, సగంలో నిలిచిపోయిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడం, తనలాంటి వారికి మనోధైర్యాన్నిచ్చేలా నిలవడం తన లక్ష్యంగా రాజకుమారి పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement