శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అమ్మాయి భాష వేరే కావడంతో తన ప్రేమను తెలియజేయడానికి హీరో పడే కష్టాలు ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ లవ్ ఎంటర్‌టైనర్‌లో కామెడీ కూడా ఫుల్‌గా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు.


