రవితేజ మూవీలో విలన్‌గా.. దాదాపు 18 ఏళ్ల తర్వాత..! | Jd Chakravarthy Joins in Ravi Teja Next Movie as Villain Role | Sakshi
Sakshi News home page

Ravi Teja: రవితేజ మూవీలో విలన్‌గా.. దాదాపు 18 ఏళ్ల తర్వాత..!

Oct 6 2026 5:04 PM | Updated on Oct 6 2026 5:07 PM

Jd Chakravarthy Joins in Ravi Teja Next Movie as Villain Role

ఇరుముడితో సక్సెస్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ. త్వరలోనే మరో సినిమాకు సిద్ధమయ్యారు.  వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో రవితేజ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో రానున్న మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ నెట్టింట వైరలవుతోంది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి విలన్‌గా నటిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఇదే జరిగితే వీరిద్దరు దాదాపు 18 ఏళ్ల తర్వాత ఓకే సినిమాలో కనిపించనున్నారు.

హారర్-కామెడీ నేపథ్యంలో రూపొందించనున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. గతంలో రవితేజ, జేడీ చక్రవర్తి చివరిసారిగా 2007లో వచ్చిన ‘దుబాయ్ శీను’లో కలిసి నటించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.  ఇప్పటికే ఈ చిత్రానికి ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దసరా సందర్భంగా సినిమాను అధికారికంగా లాంఛ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement