అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీసీ’. రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నటుడిగానూ ఆరంగేట్రం చేశారు. అయితే సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
50 రోజుల పాటు..
లోకేశ్ బాడీని ఫిట్‌గా మార్చుకునేందుకు ఏకంగా 50 రోజుల పాటు కఠినమైన వర్కౌట్ రొటీన్‌ను ఫాలో అయ్యారట. ఆయన ట్రైనర్ తాజాగా షేర్ చేసిన వీడియోలో జిమ్‌లో లోకేశ్ కసరత్తులు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు అప్పర్, లోయర్ బాడీ వర్కౌట్స్ చేస్తూ బైసెప్స్, కండరాలను టోన్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. దర్శకుడి నుంచి కథానాయకుడిగా మారే క్రమంలో లోకేశ్ చూపించిన అంకితభావాన్ని ట్రైనర్ ప్రశంసించారు.
అరుణ్ మాథేశ్వరన్‌కు నాలుగో చిత్రం
‘డీసీ’ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘రాకీ’ (2021), ‘సాని కాయిదమ్’ (2022), ‘కెప్టెన్ మిల్లర్’ (2024) చిత్రాలను ఆయన తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ అందించగా.. జీకే ప్రసన్న ఎడిటింగ్, పీసీ స్టంట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కథానాయికలుగా నటించారు. ఆడుకలం నరేన్, తలైవాసల్ విజయ్, కస్తూరి రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదీ చదవండి: షూటింగ్‌లో అస్వస్థత..! డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్


