breaking news
maduri
-
మరో మహిళతో గదిలో.. భార్యకు పట్టుబడ్డ ‘బాసింగ బలాలు’ హీరో
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి వివాదంలో చిక్కుకున్నాడు. మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి బెడ్‌పై కూర్చుని ఉండగా.. ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం అక్కడున్న వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం అర్థరాత్రి జరిగినట్లు సమాచారం.ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు, సదరు మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌కు మధ్య సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు, దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇక ఈశ్వర్ సాయి ‘బాసింగ బలాలు’ ఫోక్ సాంగ్‌తో ఇటీవల మరింత పాపులర్ అయ్యారు. ఈ పాటలో ఆయనతో పాటు వైష్ణవి సోనీ నటించారు. విడుదలైన కొద్ది రోజులకే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారి భారీగా వ్యూస్ సొంతం చేసుకుంది. పెళ్లిళ్లు, డీజే కార్యక్రమాల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభించింది.మరోవైపు మాధురి రాథోడ్‌తోనూ ఈశ్వర్ సాయి గతంలో పలు ఫోక్ సాంగ్స్‌లో కలిసి కనిపించారు. ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి పాటల్లో వీరిద్దరూ కలిసి నటించారు.భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులుఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్యఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా నటించిన మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి pic.twitter.com/FNmtrKUA7E— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026 -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
చేపూర్(పెర్కిట్), న్యూస్‌లైన్: కన్న బిడ్డ జీవి తాన్ని వివాహం పేరుతో బాల్యంలోనే తుంచి వేయాలని చూసిన కసాయి తండ్రి ప్రయత్నాలను ఐసీడీఎస్ శాఖ అధికారులు శనివారం అడ్డుకున్నారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రా మానికి చె ందిన శ్రీరామ్ రమేశ్ మద్యానికి బా నిసై కుటుంబ పోషణను గాలికొదిలేశాడు. భార్య లత, 13 ఏళ్ల కూతురు మాధురిని నిత్యం వేధించేవాడు. ఇది చాలదన్నట్లు మైనరైన తన కూతురు మాధురిని నందిపేట్ మం డల కేంద్రానికి శ్రీనివాస్(30)కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలిసిన ఐసీడీఎస్ సీడీపీవో ఇందిర, కౌన్సిలర్లు జమ్రు, హ రిలు, ఎస్‌హెచ్‌వో లక్ష్మీనారాయణ సహకారం తో చేపూర్, నందిపేట్ గ్రామాలకు వెళ్లి శని వా రం ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహి ంచారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత ్య నేరమని, బాల్యంలో వివాహం చేస్తే జరిగే అనర్ధాలను కుటుంబాలకు వివరించారు. బాల్య వివాహాలు జరిపించే వారికి, హాజరైన వారికి రూ రెండు లక్షల జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష విధించ బడుతుందని వివరించి పెళ్లిని అడ్డుకున్నారు. అనంతరం మాధురిని అధికారులు పెర్కిట్‌లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఉన్నత చదువుల కోసం చేర్పించారు.


