కన్న బిడ్డ జీవి తాన్ని వివాహం పేరుతో బాల్యంలోనే తుంచి వేయాలని చూసిన కసాయి తండ్రి ప్రయత్నాలను ఐసీడీఎస్ శాఖ అధికారులు శనివారం అడ్డుకున్నారు.
చేపూర్(పెర్కిట్), న్యూస్‌లైన్: కన్న బిడ్డ జీవి తాన్ని వివాహం పేరుతో బాల్యంలోనే తుంచి వేయాలని చూసిన కసాయి తండ్రి ప్రయత్నాలను ఐసీడీఎస్ శాఖ అధికారులు శనివారం అడ్డుకున్నారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రా మానికి చె ందిన శ్రీరామ్ రమేశ్ మద్యానికి బా నిసై కుటుంబ పోషణను గాలికొదిలేశాడు. భార్య లత, 13 ఏళ్ల కూతురు మాధురిని నిత్యం వేధించేవాడు. ఇది చాలదన్నట్లు మైనరైన తన కూతురు మాధురిని నందిపేట్ మం డల కేంద్రానికి శ్రీనివాస్(30)కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలిసిన ఐసీడీఎస్ సీడీపీవో ఇందిర, కౌన్సిలర్లు జమ్రు, హ రిలు, ఎస్‌హెచ్‌వో లక్ష్మీనారాయణ సహకారం తో చేపూర్, నందిపేట్ గ్రామాలకు వెళ్లి శని వా రం ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహి ంచారు.
బాల్య వివాహాలు చేయడం చట్టరీత ్య నేరమని, బాల్యంలో వివాహం చేస్తే జరిగే అనర్ధాలను కుటుంబాలకు వివరించారు. బాల్య వివాహాలు జరిపించే వారికి, హాజరైన వారికి రూ రెండు లక్షల జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష విధించ బడుతుందని వివరించి పెళ్లిని అడ్డుకున్నారు. అనంతరం మాధురిని అధికారులు పెర్కిట్‌లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఉన్నత చదువుల కోసం చేర్పించారు.


