పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ.. ప్రభుత్వం కొత్త ప్లాన్‌ | Maharashtra Plans New Rule To Print Bride And Groom Birth Dates On Wedding Cards To Curb Child Marriages | Sakshi
Sakshi News home page

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ.. ప్రభుత్వం కొత్త ప్లాన్‌

Jun 25 2026 7:14 AM | Updated on Jun 25 2026 11:48 AM

Maharashtra Govt Plan To Mention Date Of Birth On Wedding Cards

ముంబై: బాల్యవివాహాల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని యోచిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యుడు అతుల్‌ భత్ఖాల్కర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను సభకు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించే విధానం ఇప్పటికే రాజస్థాన్‌లో అమల్లో ఉందని, దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపి, ఈ విధానాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement